కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులో కనిపించింది చూసి.. షాక్ లో డాక్టర్లు...

Published : Jun 08, 2022, 01:26 PM IST
కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులో కనిపించింది చూసి.. షాక్ లో డాక్టర్లు...

సారాంశం

కడుపునొప్పితో వచ్చిన మహిళ కడుపులో కనిపించింది చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. దానికి కారణం అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే అని తేల్చేశారు. ఇంతకీ ఆమె కడుపులో ఏముందంటే... 

పశ్చిమ బెంగాల్ : West Bengalలో కొంత కాలంగా ఓ మహిళ 
Abdominal painతో బాధపడుతోంది. మొదట్లో ఆమె ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోలేదు. ఇంట్లోనే వైద్యం చేయించుకునేది. దానివల్ల కడుపు నొప్పి తగ్గకపోగా.. విపరీతంగా పెరిగిపోవడంతో ఇక చేసేదేమీలేక చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్లు ఆమెకు Scaning చేసి... రిపోర్ట్స్ చూడగా.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళితే..  పశ్చిమ బెంగాల్ లోని Bankura జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అనే మహిళ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె మొదట్లో ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అది క్రమేపీ పెరుగుతూ తీవ్రమైన నొప్పిగా మారడంతో స్థానిక సబ్ డివిజనల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళింది డాక్టర్లు సదరు మహిళకు స్కానింగ్ చేయగా… రిపోర్ట్స్ లో ప్లాస్టిక్, వ్యర్ధాలు ఉన్నట్లు గుర్తించారు.

ఆ తర్వాత ఆమె కడుపులో నుంచి వంద గ్రాముల ప్లాస్టిక్,  వ్యర్ధాలను ఆపరేషన్ ద్వారా తొలగించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్సకు ‘హార్ట్ మ్యాన్  ఆపరేషన్’ గా డాక్టర్లు నామకరణం చేశారు.  ప్రస్తుతం హీరా షేక్ ఆరోగ్యం బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్లే ఈ వ్యర్థాలు కడుపులో ఏర్పడ్డాయని డాక్టర్లు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, మే 30న ఇలాంటి విచిత్రమైన ఘటనే బీహార్ లో జరిగింది. Biharలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 40 రోజుల పసికందు శరీరంలో Foetus పెరిగింది. బీహార్ మోతిహారి జిల్లాలోని రహ్మానియా Medical Center కు ఓ దంపతులు తమ 40-Day-Old Babyని తీసుకువచ్చారు. చిన్నారి పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండి శిశువు సరిగా మూత్రం పోయలేక పోతోందని వైద్యులు గుర్తించారు. దీనికి కారణాన్ని తెలుసుకునేందుకు సిటి స్కాన్ పరీక్షలు జరపగా విషయం బయటపడింది.

స్కానింగ్ రిపోర్ట్ చూసి వైద్యుడు తబ్రీజ్ అజీజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నారి శరీరంలో ఓ పిండం ఉందని, అది పెరుగుతూ వస్తోందని గుర్తించారు. వైద్య పరిభాషలో దీన్ని ‘ఫీటస్ ఇన్ ఫెటు’ పిలుస్తారని.. శిశువు కడుపులో ఇంకో పిండం పెరగడాన్ని ఇలా అంటారని తెలిపారు. ఐదు లక్షల మందిలో ఒక్కరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుందని వివరించారు. విషయం తల్లిదండ్రులకు వివరించి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు వెల్లడించారు. చిన్నారి బాగానే కోలుకుందని, డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !