Kerala Gold Smuggling Case: "అవి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు" : సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్

Published : Jun 08, 2022, 01:09 PM IST
Kerala Gold Smuggling Case: "అవి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు" : సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్

సారాంశం

Kerala Gold Smuggling Case: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన భార్య, కుమార్తె ప్రమేయం ఉందని ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ మంగళవారం కోర్టులో వెల్లడించ‌డంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే.. ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి స్వప్నా సురేష్ ఆరోపణలను రాజకీయ ఎజెండాలో భాగమ‌ని అభివర్ణించారు.  

Kerala Gold Smuggling Case:  కేరళలో గతంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) వ్యవహారం తాజాగా.. మ‌రోసారి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. గతేడాది కేరళ శాస‌న స‌భ‌ ఎన్నికల సమయంలో.. ఈ వివాదం కేరళ రాజకీయాలు తీవ్ర ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టించింది. అయితే తాజాగా బంగారం స్మ‌గ్లింగ్ కేసులో నిందితురాలు స్వ‌ప్న సురేశ్(Swapna Suresh) తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. 

కేరళ సీఎం పినరయి విజయన్​ కారణంగానే తాను గోల్డ్ స్మగ్లింగ్​ కేసులో ఇరుక్కున్నట్లు స్వప్న సురేశ్​ వెల్లడించారు. ఈ కేసుతో కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్‌, ఆయన భార్య క‌మ‌లా విజ‌య‌న్‌, కూతురు వీణా విజ‌య‌న్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ళిని నెట్టో, సీఎం అద‌న‌పు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సీఎం ర‌వీంద్ర‌న్‌, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జ‌లీల్‌ల‌కు సంబంధ‌ముంద‌ని ఆమె ఆరోపించింది. ఆమె మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించింది.

కాగా.. స్వప్న సురేష్ చేసిన ఆరోపణలపై  కేరళ సీఎం పినరయి విజయన్ సంధించారు. ఆమె చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. స్వ‌ప్న‌ సురేష్ ఆరోపణలను తోసిపుచ్చారు. అవి నిరాధారమైనవనీ, రాజకీయ ప్రేరేపితమైనని పేర్కొన్నారు. నిందితులు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసే ఆర్థిక నేరస్థుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపై సమన్వయంతో, సమర్ధవంతంగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మొదట కోరిందనీ, దర్యాప్తు పద్ధతుల గురించి తదుపరి చట్టబద్ధమైన ఆందోళనలు సకాలంలో సూచించబడ్డాయని సిఎం విజయన్ తెలిపారు.

 రాజకీయ ఎజెండాలో భాగం 

సురేశ్‌ చేసిన ఆరోపణలపై సీఎం విజయన్‌ మాట్లాడుతూ.. త‌న‌పై,  త‌న ప్ర‌భుత్వంపై సంకుచిత రాజకీయ కారణాలతో కొన్ని వర్గాల వారు నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు. ఇది రాజకీయ ఎజెండాలో భాగమ‌ని ఆరోపించారు. ఇలాంటి ఎజెండాలను ప్రజలు తిరస్కరిస్తారనీ. విరామం తర్వాత.. కేసులో ప్రతివాది పాత విషయాలను పునరావృతం చేస్తారనీ, అందులో నిజానిజాల్లేవ‌ని, తప్పుడు ఆరోపణలు చేశార‌ని, కుట్రలో భాగమని సీఎం పేర్కొన్నారు.

అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా త‌న‌ ప్రభుత్వ రాజకీయ నాయకత్వం యొక్క సంకల్పాన్ని బద్దలు కొట్టవచ్చని వారు భావిస్తే, అది వ్యర్థమేనని సంబంధిత వ్యక్తులు ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. చాలా కాలంగా ప్రజా క్షేత్రంలో ప్రజలతో మమేకమై తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటూ ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్న వారిపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం కుట్రలో భాగమేనని స్పష్టమవుతోందని అన్నారు.  

సీఎం విజయన్ తన అభిప్రాయాలను మ‌రోసారి పునరుద్ఘాటించారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న దాడులను కేరళ ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. కేరళ సమగ్ర అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమం కోసం కృషి చేస్తున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే లక్ష్యంతో నిరాధారమైన ప్రచారం చేస్తున్నార‌ని  తిరస్కరిస్తారు.  బంగారం స్మగ్లింగ్ కేసులో సిఎం, అతని కుటుంబం ప్రమేయం ఉందని ఆమె ఆరోపించిన తరువాత సురేష్ ప్రభుత్వంపై రాష్ట్రంలో తాజా నిరసనలను రేకెత్తించిన తరువాత సిఎం సమాధానమిచ్చారు.

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు ఏమిటి?

కేరళ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. 5 జూలై 2020న, తిరువనంతపురం విమానాశ్రయంలో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఇది దొరికింది. అనంత‌రం సరిత్ ను అదుపులోకి తీసుకున్నారు. చివరికి అసలు నిజం చెప్ప‌డంతో ఈ గోల్ట్ స్మగ్లిండ్ సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది. దీంతో ఈ కేసులో కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజర్‌గా పనిచేస్తున్న స్వప్న సురేష్, మాజీ కాన్సులేట్ ఉద్యోగి, సిఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్‌లను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో  స్వప్న సురేష్ అరెస్టయిన 16 నెలల తర్వాత నవంబర్ 2021లో జైలు నుండి విడుదలైంది. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?