సమాధిలో నుంచి పదేళ్ల బాలిక తల అదృశ్యం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?

Published : Oct 27, 2022, 06:59 PM IST
సమాధిలో నుంచి పదేళ్ల బాలిక తల అదృశ్యం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?

సారాంశం

తమిళనాడులో ఓ ప్రమాదంలో పదేళ్ల బాలిక మరణించింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి ఆమెను ఖననం చేశారు. పది రోజుల తర్వాత సమాధి ట్యాంపర్డ్‌గా కనిపించింది. పోలీసులు రంగంలోకి సమాధి తవ్వగా ఆ బాలిక తల కనిపించకుండా పోయింది.  

చెన్నై: తమిళనాడులో ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. వారం క్రితం సమాధి చేసిన పదేళ్ల బాలిక తల అదృశ్యమైంది. తమిళనాడు చెంగల్‌పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని చిత్రవాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన అలక్టోబర్ 25న పోలీసులకు రిపోర్ట్ చేశారు. పోలీసు అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఆరో తరగతి చదివే పదేళ్ల బాలిక క్రితిక అక్టోబర్ 5న తీవ్రంగా గాయపడింది. ఆమె ఇంటి వెలుపల ఆడుకుంటూ ఉండగా ఒక ఎలక్ట్రిక్ పోల్ ఆ బాలిక పై పడింది. ఈ ఘటనలో ఆమె తల తీవ్రంగా గాయపడింది. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. సుమారు తొమ్మిది రోజులు ఆమె హాస్పిటల్‌లో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడింది. చివరకు అక్టోబర్ 14వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచింది.

అక్టోబర్ 15వ తేదీన కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. పది రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు పాండియన్, నదియాలు ఆమె సమాధిలో మార్పు వచ్చినట్టు గమనించారు. అక్కడ ఏదో జరిగిందనే అనుమానం వారిద్దరికకీ వచ్చింది. ఈ అనుమానాలు రాగానే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: కేరళలో మరో క్షుద్రపూజ కలకలం .. ఏకంగా పిల్లలతో, పోలీసుల అదుపులో మంత్రగత్తె

వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా మెడికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు ఆ సమాధిని తవ్వారు. ఆ సమాధిలో పాప డెడ్ బాడీని చూసి వారు హతాశయులయ్యారు. ఆమె తల అదృశ్యమైంది.

చిట్టమూర్ పోలీసులు ఈ కేసును అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. శత్రుత్వం కారణంగా ఆ బాలిక తలను ఎత్తుకెళ్లారా? లేక ఇంకేదైనా మంత్ర, తంత్రాల కోసం తీసుకెళ్లారా? అనే కోణాల్లోనూ విచారిస్తున్నారు.

ఆ బాలికను సమాధి చేసిన ప్రాంతానికి సమీపంలోనే కొన్ని వాడి పడేసిన గ్లౌసులు, టార్చ్ లైట్ లభించినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది.

PREV
click me!

Recommended Stories

పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్