జమ్మూ కాశ్మీర్‌లో లోయలో పడిన కారు: 10 మంది మృతి

Published : Mar 29, 2024, 10:56 AM IST
జమ్మూ కాశ్మీర్‌లో  లోయలో పడిన కారు: 10 మంది మృతి

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో  10 మంది మృతి చెందారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని  జమ్మూ-శ్రీనగర్  జాతీయ రహదారిపై  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  10 మంది మృతి చెందారు. రంబాన్ జిల్లాలోని బ్యాటరీ చష్మా ప్రాంతంలో లోయలో కారు పడిపోయింది. శ్రీనగర్ నుండి జమ్మూకు వెళ్తున్న  సమయంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున  01:15 గంటల సమయంలో  300 అడుగుల లోతులోని లోయలో  కారు పడిపోయింది.ఈ ఘటనలో కారులో ప్రయాణీస్తున్న  10 మంది మృతి చెందారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన  ప్రాంతంలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.  వర్షం కురుస్తున్నా  ప్రమాద స్థలం నుండి  10 మృతదేహలను కారు నుండి వెలికి తీశారు.

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !