
న్యూఢిల్లీ:ఒడిశాలో పిడుగుల వర్షంలో 10 మంది మృతి చెందారు. మరో ముగ్గురు మృతి చెందారు. ఒడిశాలోని ఆరు జిల్లాల్లో పిడుగుల వర్షంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.శనివారం నాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పిడుగుల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.
పిడుగుపాటుకు ఖుర్దా జిల్లాలో నలుగురు, బోలంగిర్ లో ఇద్దరు. అంగుల్, బౌధ్, జగత్ సింగ్ పూర్, ధెంకనల్ లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో వైపు ఖుర్దాలో పిడుగుపాటుకు మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు వివరించారు. భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. భువనేశ్వర్, కటక్ లలో 90 నిమిషాల వ్యవధిలోనే 126 మి.మీ. 95.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల మూడో తేది నీటికి మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్ఆర్ బిశ్వాస్ చెప్పారు.