అమరావతిలో షాకింగ్ సీన్.. బెడ్ బాక్స్‌లో తల్లీకొడుకు మృతదేహాలు.. అతడిపైనే అనుమానం..!!

Published : Sep 03, 2023, 09:59 AM IST
అమరావతిలో షాకింగ్ సీన్.. బెడ్ బాక్స్‌లో తల్లీకొడుకు మృతదేహాలు.. అతడిపైనే అనుమానం..!!

సారాంశం

మహారాష్ట్ర‌లోని అమరావతిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని బెడ్ బాక్స్‌లో తల్లీకొడుకు మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

మహారాష్ట్ర‌లోని అమరావతిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని బెడ్ బాక్స్‌లో తల్లీకొడుకు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను 45 ఏళ్ల నీలిమ గణేష్ కప్సే, ఆమె 22 ఏళ్ల కుమారుడు ఆయుష్ కప్సేగా గుర్తించారు. వివరాలు.. మృతులు నీలిమ గణేష్ కప్సే అమరావతి నగరంలో నివాసం ఉంటున్నారు. అయితే రెండు రోజులు ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు వారి బంధువులకు సమాచారం  అందజేశారు. దీంతో నాగ్‌పూర్  నంచి వారి బంధువులు అక్కడి చేరుకున్నారు. 

అయితే ఇంటికి తాళం వేసి  ఉండటాన్ని గమనించి.. వెంటనే పోలీసులకు ఫోన్  చేసి సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు .. ఇంటి ముందు తలుపు లోపలి  నుంచి తాళం వేసి ఉందని, వెనుక తలుపు మూసి ఉందని  గుర్తించారు. ఈ క్రమంలోనే తలుపులను బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇంట్లో ఉన్న మంచంపై నుంచి రక్తం  కారడం, మొత్తం దుర్వాసన  రావడాన్ని పోలీసులు గుర్తించారు. 

అయితే అనుమానంతో బెడ్ బాక్స్ తెరిచి చూడగా అందులో నీలిమ గణేష్ కప్సే, ఆమె కొడుకు యుష్ కప్సే మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇరుగుపొరుగు వారి నుంచి వివరాలను సేకరించారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి నీలిమ పెద్ద కుమారుడు కనిపించలేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉందని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu