
కర్ణాటకలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో టీచర్లు, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. రామనగర్‌లోని కెంపేగౌడ పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సి సైన్స్ ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయులు లీక్ చేశారని రామనగర జిల్లాలోని మాగడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ పరీక్షలు మార్చి 28 నుంచి ఏప్రిల్ 11 మధ్య పరీక్ష జరిగాయి.
Chidambaram: ఆయుధాల కొనుగోలుకు సంబంధించి కఠిన చట్టాలు అవసరం : చిదంబరం
అయితే ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షా ఫలితాలను ప్రకటించిన కొద్ది రోజులకు నిందితులను అరెస్టు చేశారు. మాగడిలోని కెంపేగౌడ పాఠశాలలో గుమాస్తాగా పనిచేస్తున్న రంగేగౌడతో పాటు మరికొందరు సైన్స్ ప్రశ్నపత్రం ఫొటోలను అదే పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారని రామనగర జిల్లా పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీపీఐ) గంగన్నస్వామి ఏప్రిల్ 11వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినందుకు, నేరపూరిత కుట్ర, దోపిడీకి పాల్పడిన ఆరోపణలతో ఉపాధ్యాయులు, స్థానిక జర్నలిస్టుతో సహా 10 మందిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను మట్టుబట్టిన సైన్యం
ఈ ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించిన వివరాలను పోలీసులు తెలియజేశారు. ‘‘ రామానగర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో భద్రపరిచిన సైన్స్ ప్రశ్నపత్రాలను ఓ ప్రైవేట్ స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఫొటోలు తీశాడు. ఆయన దానిని గుమస్తాకు పంపించాడు. పరీక్ష రోజున ప్రశ్నపత్రం లీక్ విషయం తెలిసిన ఉపాధ్యాయులు పరీక్ష హాల్‌లో ప్రశ్నలకు సమాధానమివ్వడంలో విద్యార్థులకు సహాయం చేసారు. అయితే ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆ గుమాస్తాను బ్లాక్ చేశాడు. అలాగే ఆ హెడ్ మాస్టర్ స్నేహితుడైన స్థానిక జర్నలిస్టు కూడా పెగౌడ పాఠశాల ఉపాధ్యాయులను బ్లాక్ మెయిల్ చేసి, లీకేజీని పోలీసులకు బయటపెడతానని బెదిరించాడు.’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
కాగా ఈ లీకేజీ విషయంలో ప్రత్యేకంగా ఎవరికీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవని అధికారులు తెలిపారు. కాకపోతే గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు మెరుగైన మార్కులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఇలా చేశారని విచారణలో తమకు తెలిసిందని పేర్కొన్నారు. నిందితులపై IPC సెక్షన్ 417, 418, 420, 201, 120B కింద అభియోగాలు మోపారు. కర్నాటక విద్యా చట్టం 1983లోని సెక్షన్లు 24(A), 115(A), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 66 కింద నిందితులందరినీ ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.