కరోనా ఎఫెక్ట్: విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన ఈసీ

By narsimha lodeFirst Published Apr 27, 2021, 11:59 AM IST
Highlights

మే 2వ తేదీన ఆ తర్వాత కూడ విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకొంది. 
 

న్యూఢిల్లీ: మే 2వ తేదీన ఆ తర్వాత కూడ విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకొంది. మే 2వ తేదీన  నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో  విజయోత్సవ ర్యాలీలపై ఈసీ ఈ నిర్ణయం తీసుకొంది. 

విజయం సాధించిన అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారి నుండి  ధృవీకరణ పత్రం తీసుకోవడానికి తమతో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కరోనా కట్టడిలో అన్ని రాజకీయపార్టీలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం,పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. బెంగాల్ లో ఏడువిడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ పూర్తైంది. ఈ నెల 29న చివరి విడత పోలింగ్ పూర్తి కానుంది. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించడం, రోడ్ షోలతో  పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. బెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగినట్టుగా ఆరోగ్యశాఖ నివేదికలు తెలుపుతున్నాయి. 
 

click me!