మీరొస్తారని అనుకున్నాను కానీ... ట్విట్టర్ లో మాట్లాడేసుకున్న మోదీ, క్రేజీవాల్..

By telugu news teamFirst Published Feb 17, 2020, 9:12 AM IST
Highlights

ప్రమాణస్వీకార వేధికపైనే కేజ్రీవాల్  భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. 
 

దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి ఘనమైన విజయాన్ని సాధించింది. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. కానీ.. ఆయన మాత్రం హాజరుకాలేదు.

ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకార వేధికపైనే కేజ్రీవాల్  భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. 

“ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌కు, అరవింద్‌ కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్‌. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని మోదీ పోస్టు చేశారు.

Also Read కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... సందడి చేసిన బుల్లి మఫ్లర్ మ్యాన్...

కాగా ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్ పై అరవింద్ కేజ్రీవాల్ వెంటనే స్పందిస్తూ… “థాంక్యూ సో మచ్‌ సార్‌. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు వస్తారనుకున్నాను. కానీ మీరు బిజీగా ఉంటారని నేను అర్థం చేసుకోగలను.  న్యూఢిల్లీని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను” అని కేజ్రీవాల్ సమాధానమిచ్చారు.  కాగా ఇప్పుడు వీరిద్దరి ట్విట్టర్ సంభాషణ తీవ్ర ఆసక్తి రేపింది.

Thank you for the warm wishes sir. I wish you could come today, but I understand you were busy. We must now work together towards making Delhi a city of pride for all Indians https://t.co/hHFvH8cLCJ

— Arvind Kejriwal (@ArvindKejriwal)

 

మొన్నటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ఆమ్ ఆదీపార్టీ సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు సాధించగా, బీజేపీ పార్టీ కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది చెప్పాలి. ఇకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం ఖాతా కూడా తెరవలేదు.

click me!