ట్రంప్ ఉచ్ఛారణలో తప్పులు: ఆడుకుంటున్న నెటిజన్లు

By telugu team  |  First Published Feb 24, 2020, 5:53 PM IST

నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉచ్ఛారణలో చాలా తప్పులు చేశారు. స్వామి వివేకానంద పేరు వివేకామానన్ గా ఉచ్ఛరించారు. వేదాలను వేస్టాస్ గా పలికారు.


అహ్మదాబాద్: ఆహ్మదాబాదులోని మొతెరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో పలువురు క్రికెటర్ల పేర్లు, బాలీవుడ్ సినిమా పేర్లను ప్రస్తావించారు. భారతదేశానికి చెందిన కొన్ని విశిష్టమైన విషయాలను కూడా ఆయన తడిమారు.

నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ చేసిన ప్రసంగలో ఉచ్ఛారణలో తప్పులు దొర్లాయి. వాటిని పట్టుకుని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఆయన ప్రసంగానికి ప్రశంసలు కూడా వస్తున్నాయి. 

Latest Videos

undefined

ప్రధాని నరేంద్ర మోడీని చాయ్ వాలా అనడానికి బదులు చివాలా (chiwala) అన్నారు. వేదాలను ప్రస్తావిస్తూ వేస్టాస్ (The Vestas) అన్నారు. స్వామి వివేకానంద పేరును కూడా తప్పుగా ఉచ్చరించారు. వివేకామానన్ (Vivekamanan) అని పలికారు. 

హిందీ సినిమాల గురించి ప్రస్తావించడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. షోలేను, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలను ప్రస్తావించారు. షోలే ను Shojayగా పలికారు

Something about Donald Trump's pronunciation of Sachin Tendulkar tells me he isn't a huge cricket fan pic.twitter.com/stFhq46MLx

— Andy Silke (@andysilke)

 

Lord! Trump just said Swami Viveka-mu-nand!

— Just A Citizen (@ks_NotANiceGirl)

All the words Trump mispronounced (and how to say them correctly):
- Suuchin Tendulkar (Sachin Tendulkar)
- Cheewallah (Chaiwallah)
- Shojay (Sholay)
- The 'Vestas' (The Vedas)
- Swami Vivekamanan (Swami Vivekananda)
Sbsa Mazadar cheewallah h😁😁 pic.twitter.com/Xt7l8A28hT

— jamia boy@ (@Rj_Jamia1)
click me!