‘మీటూ’ కి రాహుల్ గాంధీ మద్దతు

Published : Oct 12, 2018, 02:16 PM IST
‘మీటూ’ కి రాహుల్ గాంధీ మద్దతు

సారాంశం

సమాజంలో మార్పు రావాలంటే నిజాన్ని నిర్భయంగా, గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది’ అంటూ రాహుల్‌గాంధీ మీటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి ట్వీట్‌ చేశారు. 

దేశంలో మీటూ ఉద్యమం ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇప్పటివరకు పెద్ద హోదాలో మంచిగా నటిస్తున్న వారి బండారాలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఈ ఉద్యమం ద్వారా మహిళలు బయటపెడుతున్నారు. కాగా.. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు పలికారు.

 

‘మహిళలను ఎంతగా గౌరవించాలనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సమయం ఇది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారి జీవితం ముగిసిపోతుంది. దీని పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సమాజంలో మార్పు రావాలంటే నిజాన్ని నిర్భయంగా, గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది’ అంటూ రాహుల్‌గాంధీ మీటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం తనను నానాపటేకర్‌ లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమం ఊపందుకుంది. దీంతో ఎందరో నటీమణులు, పాత్రికేయులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు
Future of Jobs : డిగ్రీ హోల్డర్స్ Vs స్కిల్ వర్కర్స్ ... ఎవరి సంపాదన ఎక్కువో తెలుసా..?