‘‘సీతాదేవి టెస్ట్ ట్యూబ్ బేబీ’’

First Published Jun 1, 2018, 3:17 PM IST
Highlights

ఉప ముఖ్య మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న మహాభారతంపై కామెంట్ చేసిన ఆయన.. ఇప్పుడు రామాయణంపై మరో కామెంట్ చేశారు. మహాభారత కాలంలోనే జర్నలిజం ఉందన్న మరుసటి రోజే అలాంటిదే మరో షాకింగ్ కామెంట్ చేశారు.

రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ ఉన్నదని, సీతనే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. సీత ఓ మట్టికుండలో పుట్టిందని చెబుతారు. దీనిని బట్టి రామాయణం సమయంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ ఉన్నట్లు స్పష్టమవుతున్నది అని దినేష్ శర్మ చెప్పారు.

త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్‌లాగే ఈయన కూడా ఇప్పటి గూగుల్ పాత్రను అప్పుడు నారద ముని పోషించాడని చెబుతున్నారు. కురక్షేత్ర యుద్ధాన్ని ఢిల్లీలో ఉన్న దృతరాష్ర్టునికి కళ్లకు కట్టినట్లు సంజయుడు చెప్పాడని, ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోతే మరేంటి అని దినేష్ శర్మ ప్రశ్నించారు.

జర్నలిజం మహాభారత కాలంలోనే ఉన్నదని చెబుతూ ఆయన ఈ ఉదాహరణ చెప్పడం గమనార్హం. ఇండియాలో లక్షల సంవత్సరాల కిందటే చాలా ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉండేదని ఆయన చెప్పారు.
 

click me!