
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయంలోకి మహిళలు నిస్సంకోచంగా వెళ్లవచ్చని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఎన్నో సంవత్సరాలుగా శబరిమలలో మహిళలకు ఆలయ ప్రవేశం లేని సంగతి తెలిసిందే. కాగా.. సుప్రీం కోర్టు తాజాగా.. ఆలయం తెరచి ఉన్నప్పుడు.. ఏ వయసు మహిళలైనా ఆలయంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి నుంచి శబరిమలలో స్త్రీల ప్రవేశానికి ఆంక్షలు ఉండేవి. కేవలం 50ఏళ్ల దాటిన మహిళలను మాత్రమే అనుమతించేవారు. అయితే.. 2007లో కేరళ ప్రభుత్వం.. శబరిమల ఆయంలోకి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చని.. అందులో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది. ఆ సమయంలో కొందరు మహిళలు ఆయంలో కి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు కూడా. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్( యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) వ్యతిరేకించింది.
దీంతో.. ఈ వివాదాం కోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసును పూర్తిస్థాయిలో పరిశీలించిన న్యాయస్థానం తాజాగా పైవిధంగా తీర్పునిచ్చింది.