జామియా కాల్పులు: అమిత్ షా స్పందన ఇదీ, కేజ్రీవాల్ ఇలా....

By telugu teamFirst Published Jan 30, 2020, 7:58 PM IST
Highlights

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోనిరసనకారులపై జరిగిన కాల్పులపై అమిత్ షా స్పందించారు. దోషిని వదిలేది లేదని ఆయన చెప్పారు. సంఘటనపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు.

న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో కాల్పుల సంఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారిపై రామభక్త్ గోపాల్ అనే 19 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. 

దోషిని క్షమించేది లేదని అమిత్ షా అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్ లో స్పందించారు. కాల్పుల సంఘటనపై తాను ఢిల్లీ పోలీసు కమిషనర్ తో మాట్లాడానని, బాధ్యుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించానని ఆయన చెప్పారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: ఫేస్ బుక్ లైవ్ మూమెంట్స్: జామియా షూటర్ రామభక్త్ గోపాల్

అమిత్ షా ప్రకటనతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు. ఢిల్లీలో ఏం జరుగుతోందని ఆయన అడిగారు. శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని ఆయన అన్నారు. దయచేసి ఢిల్లీ శాంతిభద్రతలపై జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను రైట్ వింగ్ క్రియాశీలక కార్యకర్తగా ఫేస్ బుక్కులో చెప్పుకున్నాడు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో కాల్పులు జరిపిన 17 ఏళ్ల యువకుడు తనను తాను రామభక్త్ గోపాల్ గా చెప్పుకున్నాడు.

Also Read: జామీయ యూనివర్శిటీలో కాల్పుల కలకలం: విద్యార్ధికి గాయాలు

నినాదాలు చేస్తూ అతను నిరసనకారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఇటూ అటూ తిరుగుతూ నినాదాలు చేస్తున్న అతన్ని నిలువరించడానికి ఆ విద్యార్థి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి ప్రయత్నించాడు. 

click me!