జామీయ యూనివర్శిటీలో కాల్పుల కలకలం: విద్యార్ధికి గాయాలు

By narsimha lodeFirst Published Jan 30, 2020, 4:19 PM IST
Highlights

న్యూఢిల్లీలోని జామీయా యూనివర్శిటీలో గురువారం నాడు కాల్పులు కలకలం చోటు చేసుకొన్నాయి. 


న్యూఢిల్లీ: న్యూఢిల్లీ జామీయా యూనివర్శిటీలో గురువారంనాడు కలకలం రేగింది. సీఏఏకు వ్యతిరేకంగా జామీయా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో  ఓ వ్యక్తి విద్యార్థులపై కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్ధినిని తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు.

Also read:జేడీయూలో సీఏఏ చిచ్చు: ప్రశాంత్ కిషోర్ బహిష్కరణ

జామీయా యూనివర్శిటీలో విద్యార్థులపై కాల్పుల ఘటనపై  పోలీసులు విచారణ చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు..జామీయా యూనివర్శిటీలో ఆందోళనకారులు ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జామ మసీద్ రెండు ద్వారాలను మూసివేశారు. ఐటీఓ, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్లను భద్రత కారణాల రీత్యా పోలీసులు మూసివేశారు.గుర్తు  తెలియని వ్యక్తి  కాల్పుల్లో  శదాబ్ద్  చేతికి గాయమైంది. అతడిని ఢిల్లీలోని హోలీ ఆసుపత్రిలో చేర్చారు. 

జామీయా యూనివర్శిటీ విద్యార్థులపై కాల్పులు జరిపింది ఢిల్లీలోని నోయిడాకు చెందిన గోపాల్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. ఫ్రీడం కావాలా అని మీకు ఫ్రీడం ఇస్తానని అరుస్తూ కాల్పులకు దిగాడు.

సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకు విద్యార్థులు సన్నద్దమైన తరుణంలో  గోపాల్ విద్యార్థులపై కాల్పులకు దిగాడు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యల వల్లే గోపాల్ ఇవాళ కాల్పులకు దిగాడని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

దేశ ద్రోహులను కాల్చి చంపాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  ఎన్నికల సభలో ప్రసంగించారు.ఈ వ్యాఖ్యలే విద్యార్థులపై కాల్పులకు దారి తీశాయని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కాల్పులకు దిగిన గోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.మరో వైపు ఈ కాల్పుల ఘటనతో యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. 

click me!