రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

By narsimha lodeFirst Published Aug 6, 2019, 1:19 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ విభజనపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ విభజన రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  అభిప్రాయపడ్డారు.

 

National integration isn’t furthered by unilaterally tearing apart J&K, imprisoning elected representatives and violating our Constitution. This nation is made by its people, not plots of land.

This abuse of executive power has grave implications for our national security.

— Rahul Gandhi (@RahulGandhi)

జమ్మూ కాశ్మీర్ విభజనపై కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ఈ విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రజలు ఎన్నుకొన్న నేతలు జైల్లో ఉన్నారని రాహుల్ గుర్తు చేశారు.దేశమంటే భూములు కావు, ప్రజలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.జమ్మూకాశ్మీర్  విభజన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరించిందన్నారు.

370 ఆర్టికల్ ను కేంద్రం సోమవారం నాడు రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ ను రెండుగా విభజించింది. లడఖ్, జమ్మూ కాశ్మీర్ లను రెండు  కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ తరహలోనే ఉంటుంది. లడఖ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది. మంగళవారం నాడు లోక్‌సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

click me!