ఈసీ ఎఫెక్ట్: హనుమాన్ ఆలయంలో యోగి పూజలు

By narsimha lodeFirst Published Apr 16, 2019, 5:18 PM IST
Highlights

లోక్‌సభ ఎన్నికల సమయంలో రెచ్చగొట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్  ఎన్నికల్లో ప్రచారంపై నిషేధం విధించడంతో   హనుమాన్ ఆలయంలో యోగి పూజలు నిర్వహించారు.

లక్నో: లోక్‌సభ ఎన్నికల సమయంలో రెచ్చగొట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్  ఎన్నికల్లో ప్రచారంపై నిషేధం విధించడంతో   హనుమాన్ ఆలయంలో యోగి పూజలు నిర్వహించారు.

మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల నుండి మూడు రోజుల పాటు  ఎన్నికల ప్రచారానికి  యోగి ఆదిత్యనాథ్ దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మంగళవారం నాడు ఉదయం హనుమాన్ సేతు  కార్యాలయానికి వచ్చిన యోగి బజరంగ్ బలికి దండం పెడుతూ మౌనంగా దీక్ష చేశారు. ముస్లింలకు అలీ ఉంటే, హిందూవులకు బజరంగ్ బలి ఉన్నాడని యోగి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని  సీఎం తీరును సుప్రీంంకోర్టు తప్పుబట్టింది.  ఈ దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత యోగి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
 

సంబంధిత వార్తలు

ప్రచారంపై నిషేధం: మాయావతి, యోగిలకు ఈసీ ఝలక్

 

click me!