ప్రచారంపై నిషేధం: మాయావతి, యోగిలకు ఈసీ ఝలక్

By narsimha lodeFirst Published Apr 15, 2019, 3:06 PM IST
Highlights

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు, బీఎస్పీ చీఫ్‌ మాయావతికి కూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించారు.
 

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు, బీఎస్పీ చీఫ్‌ మాయావతికి కూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించారు.

ఎన్నికల కమిషన్‌ పనితీరుపై సుప్రీంకోర్టు సోమవారం నాడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, నేతలు పాటిస్తున్నారా అని కూడ సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించింది. ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,  బీఎస్పీ చీఫ్ మాయావతి చేసిన వ్యాఖ్యలను కూడ సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం నాడు  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.  బీఎస్పీ చీఫ్ మాయావతిపై రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం అదికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

 

 

click me!