జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌‌పై కేసు నమోదు

Published : Apr 15, 2019, 11:03 AM ISTUpdated : Apr 15, 2019, 11:07 AM IST
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌‌పై కేసు నమోదు

సారాంశం

సినీ నటి, బీజేపీ నేత జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజంఖాన్‌పై కేసు నమోదైంది.  

లక్నో: సినీ నటి, బీజేపీ నేత జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజంఖాన్‌పై కేసు నమోదైంది.

రాంపూర్‌లో నిర్వహించిన ఓ ఎన్నికల సభలో  జయప్రద‌పై  అజంఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై రాంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయమై ఎస్పీ నేత ఆజంఖాన్ మీడియాతో మాట్లాడారు.  తాను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. 

తాను విమర్శలు చేసిన సమయంలో ఎవరి పేర్లను కూడ తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు.  ఒకవేళ ఈ విషయాన్ని రుజువు చేస్తే తాను ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఆయన  తేల్చి చెప్పారు.

తాను  9 దఫాలు రాంపూర్ నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు మంత్రిగా కూడ పనిచేశానన్నారు. అసలు ఏం మాట్లాడాలో... ఏం మాట్లాడకూడదో తనకు తెలుసునని ఆయన చెప్పారు. 

ఈ స్థానం నుండి గతంలో ఎస్పీ పార్టీ అభ్యర్ధిగా జయప్రద పోటీ చేసి విజయం సాధించారు. తాను రాంపూర్‌లో ఓక వ్యక్తిని ప్రఖ్యాతి పొందేలా చేశాను. ఆమెను ఎవరూ కూడ టచ్ చేయకుండా చేశానని పరోక్షంగా జయప్రదను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యక్తి గురించి మీకు తెలియడానికి 17 ఏళ్లు పడితే, తనకు మాత్రం 17 రోజులు మాత్రమే పట్టిందని ఆయన చెప్పారు. ఆమె  ఖాకీ నిక్కర్  వేసుకొంటుందనే విషయాన్ని 17 రోజుల్లోనే తెలుసుకొన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.

రాంపూర్‌లో తనకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు సర్క్యులేట్ అవుతున్న విషయాన్ని ములాయం దృష్టికి తీసుకొచ్చినట్టుగా జయప్రద చెప్పారు. కానీ, ఏ రాజకీయనాయకుడు కూడ తనను రక్షించలేదన్నారు.  

తనపై రాంపూర్‌లో యాసిడ్‌తో దాడికి ప్రయత్నించారని జయప్రద గుర్తు చేసుకొన్నారు.అందుకే రాంపూర్‌‌ను వదిలేసి వచ్చినట్టుగా ఆమె చెప్పారు. అంతేకాదు క్రియాశీలక రాజకీయాల నుండి  దూరమైనట్టుగా జయప్రద చెప్పారు.

జయప్రదను ఉద్దేశించి ఎస్పీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షం జేడీ(యూ) నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జయప్రదకు వెంటనే క్షమాపణలు చెప్పాలని జేడీ(యూ) నేత పవన్ వర్మ డిమాండ్ చేశారు.

ఈ విషయమై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో మౌనంగా ఉన్న భీష్ముడిగా  కూర్చోకూడదని ఆమె ములాయం సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

జాతీయ మహిళా కమిషన్త ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకొంది.  ఆజంఖాన్ కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది.  అంతేకాదు  ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధం విధించాలని ఈసీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేసింది.

2004 ఎన్నికల్లో  ఎస్పీ అభ్యర్ధిగా జయప్రద రాంపూర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో జయప్రద ఎస్పీని వీడారు.

గత మాసంలో జయప్రద బీజేపీలో చేరారు.  రాంపూర్ స్థానం నుండి  జయప్రద బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఆజంఖాన్ జయప్రద విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు ఆజం ఖాన్‌పై ఆమె పోటీకి దిగుతున్నారు.

సంబంధిత వార్తలు

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

అభ్యంతకర వ్యాఖ్యలు: ఆజం ఖాన్ కు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్

 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

PREV
click me!

Recommended Stories

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా: సాయంత్రం గవర్నర్ కు అందజేత