పోలింగ్ విధులు నిర్వహిస్తూనే టీచర్ మృతి

By narsimha lodeFirst Published Apr 18, 2019, 3:11 PM IST
Highlights

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. పోలింగ్ విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడికి గుండెపోటు రావడంతో  పోలింగ్ కేంద్రంలోనే ఆయన మృతి చెందాడు.

కాంకేర్:ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. పోలింగ్ విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడికి గుండెపోటు రావడంతో  పోలింగ్ కేంద్రంలోనే ఆయన మృతి చెందాడు.

మృతుడు తూకాలు రామ్ గా గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా ఆయన పనిచేస్తున్నాడు.  కాంకెర్ లోక్‌సభ నియోజకవర్గంలోని అంటాగఢ్ ప్రాంతంలో పోలింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు.

పోలింగ్ కేంద్రంలో ఉన్న సమయంలోనే  తనకు ఛాతీలో నొప్పి వస్తోందని  తోటి ఉద్యోగులకు చెబుతూ ఆయన కుప్పకూలాడు.ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లేలోపుగానే  ఆయన  మృతి చెందినట్టుగా వైద్యులు చెప్పారు. నేరేటీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. నేరేటి స్థానంలో మరోకరిని నియమించారు.
 

click me!