మోడీ హెలికాఫ్టర్ తనిఖీ: ఎన్నికల పరిశీలకుడు సస్పెన్షన్

By narsimha lodeFirst Published Apr 18, 2019, 11:58 AM IST
Highlights

ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందుకు గాను ఒడిశా రాష్ట్ర ఎన్నికల  పరీశీలకుడిగా ఉన్న మహ్మద్ మోసిన్‌పై  సస్పెన్షన్ వేటు పడింది.
 

భువనేశ్వర్: ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందుకు గాను ఒడిశా రాష్ట్ర ఎన్నికల  పరీశీలకుడిగా ఉన్న మహ్మద్ మోసిన్‌పై  సస్పెన్షన్ వేటు పడింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలికాప్టర్‌ను  మంగళవారం నాడు ఒడిశా రాష్ట్రంలోని సబల్‌పూర్‌లో ఈసీ అధికారులు తనిఖీ చేయడంతో మహ్మద్ మోసిన్‌పై ఈసీ వేటేసింది.1996 కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఎఎస్  అధికారి మహ్మద్ మోసిన్ ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరించారని ఈసీ అభిప్రాయపడింది.

ఎస్పీజీ భద్రత పరిధిలో ఉండే నేతలు ఉపయోగించే హెలికాప్టర్లు చెక్ చేయకూడదని  భద్రతా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు నియమ నిబంధనలు ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ఒడిశా రాష్ట్రంలోని సబల్‌పూర్‌లో ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేయడం వల్ల 15 నిమిషాల పాటు ప్రధాని అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.   అదే రోజున ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను కూడ ఈసీ అధికారులు తనిఖీ చేశారు.  అంతేకాదు అదే రోజున కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఉపయోగించిన హెలికాప్టర్‌ను కూడ ఈసీ అధికారులు తనిఖీ చేశారు.

click me!