ఈవీఎంలపై రాహుల్ ఆరోపణల్లో అంతరార్ధమేమిటి?

By narsimha lodeFirst Published May 19, 2019, 9:30 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎం‌లతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం  చేశారని  విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎం‌లతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం  చేశారని  విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians.

The EC used to be feared & respected. Not anymore.

— Rahul Gandhi (@RahulGandhi)

ఏడు విడతల ఎన్నికలు ఆదివారం నాడు పూర్తయ్యాయి. తుది విడత పోలింగ్ ముగిసిన వెంటనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. యూపీఏకు తక్కువ సీట్లు వస్తాయని అన్ని సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎలక్టోరల్ బాండ్‌ , ఈవీఎం‌లతో పాటు ఎన్నికల షెడ్యూల్‌ను కూడ మోడీ ప్రభావితం చేశారని  రాహుల్ విమర్శించారు. నమోటీవీ, మోడీ ఆర్మీని కూడ మోడీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేదార్‌నాథ్‌లో పూజలు అంటూ మోడీ డ్రామాలు ఆడుతున్నారని రాహుల్ విమర్శలు చేశారు.

click me!