చివరి విడత పోలింగ్‌‌: ముగిసిన ప్రచారం, 19న ఎగ్జిట్ పోల్స్

By narsimha lodeFirst Published May 17, 2019, 6:17 PM IST
Highlights

ఈ నెల 19వ తేదీతో  ఏడో విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏడో విడత ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి.
 

న్యూఢిల్లీ:  ఈ నెల 19వ తేదీతో  ఏడో విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏడో విడత ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి.

దేశ వ్యాప్తంగా  అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో  ఏడో విడతతో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ వెలువడనున్నాయి. దేశంలోని అన్ని పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు కూడ ఎన్నికలు జరిగాయి. 

ఈ నెల  23వ తేదీన దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెువడనున్నాయి. పార్లమెంట్ స్థానాలతో పాటు ఏపీ సహా మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు కూడ  వెలువడుతాయి.

చివరి విడతలో యూపీలో 13 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మోడీ పోటీ చేస్తున్న వారణాసి ఎంపీ స్థానానికి కూడ చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.  పంజాబ్ రాష్ట్రంలోని 13 ఎంపీ, బెంగాల్ రాష్ట్రంలో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్‌‌ప్రదేశ్‌లో 4, ఝార్ఖండ్‌లో3, ఛంఢీఘడ్‌లో 1 ఒక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి

click me!