
ఛత్తీస్‌ఘడ్: రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కావాసి లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి లఖ్మాకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఈవీఎంలో మొదటి బటన్ మాత్రమే నొక్కాలని రెండో, మూడో బటన్ నొక్కితే కరెంట్ షాక్ తగులుతుందని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిందన్నారు.
బుధవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కావాసి లఖ్మా ఓటర్లంతా ఈవీఎంలపై ఉన్న మొదటి బటన్ మాత్రమే నొక్కాలన్నారు. (మొదటి బటన్‌లో కాంగ్రెస్ పార్టీ గుర్తు) అలా కాదని రెండో బటనో లేదా మూడో బటనో నొక్కితే కరెంట్ షాక్ తగులుతుందన్నారు. అందరూ జాగ్రత్తగా మొదటి బటన్ నొక్కాలని ఆయన ఓటర్లకు సూచించారు.
ఈ వ్యాఖ్యలు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ఉందన్నారు. అది ఎన్నికల నియమాశలిని ఉల్లంఘించమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. దేశ వ్యాప్తంగా రెండో దశ లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 18న జరగనున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.