40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: దీదీకి మోడీ షాక్

Published : Apr 29, 2019, 04:07 PM IST
40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: దీదీకి మోడీ షాక్

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి షాకిచ్చారు. టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన ప్రకటించారు.  


కోల్‌కత్తా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి షాకిచ్చారు. టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన ప్రకటించారు.

ప్రధానమంత్రి మోడీ సోమవారం నాడు  బెంగాల్ రాష్ట్రంలోని సేరమోర్ ప్రాంతంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల్లో అన్ని చోట్ల కమలం వికసిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

40 మంది ఎమ్మెల్యేలు టీఎంసీని వదిలిపెట్టనున్నారని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రతించారని ఆయన చెప్పారు.ఎన్నికల సమయంలో మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా: సాయంత్రం గవర్నర్ కు అందజేత