వారణాసి నుండి నామినేషన్ దాఖలు చేసిన మోడీ

By narsimha lodeFirst Published Apr 26, 2019, 11:41 AM IST
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పార్లమెంట్ స్థానం నుండి  శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు 2014 ఎన్నికల్లో మోడీ తొలిసారిగా ఈ పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు.ఆ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో మోడీ విజయం సాధించారు.
 

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పార్లమెంట్ స్థానం నుండి  శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు 2014 ఎన్నికల్లో మోడీ తొలిసారిగా ఈ పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు.ఆ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో మోడీ విజయం సాధించారు.

వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  నరేంద్ర మోడీ గురువారం నాడు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహన్ని నింపారు.గురువారం  రాత్రి పూట వారణాసిలోనే మోడీ బస చేశారు.

దేశంలో ప్రభుత్వ అనుకూల వాతావరణం నెలకొందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. వారణాసిలో శుక్రవారం నాడు నిర్వహించిన సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో వైపు వారణాసిలో ఈ దఫా  అన్ని రకాల ఓటింగ్ రికార్డులను చెరిపివేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఏకపక్షంగా ఓటింగ్ జరగాలనే రీతిలో మోడీ అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం నాడు ఉదయం  వారణాసిలోని  కాలభైరవ ఆలయంలో  మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో  మోడీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

మోడీతో  పాటు  ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన పార్టీల ప్రతినిధులు కూడ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారణాసి కలెక్టర్ కార్యాలయానికి మోడీ ర్యాలీగా చేరుకొన్నారు. అప్పటికే అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఠాక్రేలు మోడీని అభినందించారు. అనంతరం మోడీ కలెక్టరేట్‌లో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

click me!
Last Updated Apr 26, 2019, 11:42 AM IST
click me!