ఎన్నికలు: ఐటీ దాడులపై వీరికి ఈసీ పిలుపు

Published : Apr 09, 2019, 05:43 PM IST
ఎన్నికలు: ఐటీ దాడులపై వీరికి ఈసీ పిలుపు

సారాంశం

దేశంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకొంటున్న ఐటీ దాడుల విషయమై మాట్లాడేందుకు సీబీడీటీ ఛైర్మెన్, రెవిన్యూ సెక్రటరీలను కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించింది.  


న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకొంటున్న ఐటీ దాడుల విషయమై మాట్లాడేందుకు సీబీడీటీ ఛైర్మెన్, రెవిన్యూ సెక్రటరీలను కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించింది.

కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు చేసుకొంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈసీ తీసుకొన్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకొంది. రాజ్యాంగ సంస్థలను బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రత్యర్థులపై ఉసిగొల్పుతోందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు దాడులు నిర్వహిస్తే నిష్పక్షంగా వ్యవహరించాలని  కోరింది. వేధింపులు చేయకూడదని సూచించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఆర్థిక శాఖకు ఈసీ కొన్ని ప్రత్యేక సూచనలను చేసింది. ఇప్పటికే కొన్ని పార్టీల నేతలు ఐటీ శాఖ తీరుపై ఈసీకి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు  లెక్కలు చూపని రూ.281 కోట్లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకొంది.
 

PREV
click me!

Recommended Stories

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా: సాయంత్రం గవర్నర్ కు అందజేత