రామ మందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: బీజేపీ మేనిఫెస్టో

By narsimha lodeFirst Published Apr 8, 2019, 12:29 PM IST
Highlights

మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగింపుకు ఒక్క రోజు ముందుగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఆ పార్టీ హామీ ఇచ్చింది


న్యూఢిల్లీ: మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగింపుకు ఒక్క రోజు ముందుగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఆ పార్టీ హామీ ఇచ్చింది. రామ మందిరాన్ని నిర్మిస్తామని కూడ ఆ  పార్టీ తన మేనిఫెస్టోలో తేల్చి చెప్పింది.

సోమవారం నాడు న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తదితరులు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

48 పేజీలతో ఈ మేనిఫెస్టోను ఆ పార్టీ రూపొందించింది. జాతీయ భద్రతకు తాము పెద్ద పీట వేస్తామని బీజేపీ ప్రకటించింది.వ్యవసాయానికి పెద్ద పీట వేయనున్నట్టు కూడ బీజేపీ తేల్చి చెప్పింది.రైతాంగం సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టనున్నట్టు కూడ బీజేపీ వివరించింది.

2020 నాటికి రైతులందరికీ ఇళ్లను నిర్మించనున్నట్టు బీజేపీ హామీ ఇచ్చింది. మరో వైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఆ పార్టీ హమీ ఇచ్చింది. పేద, మద్యతరగతి రైతులకు పెన్షన్ విధానాన్ని కూడ అమలు చేయనున్నట్టు ఆ పార్టీ  ప్రకటించింది.

మౌళిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా కేంద్రీకరించనున్నట్టు కూడ బీజేపీ హామీ ఇచ్చింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వైద్యం అందించేందుకు వీలుగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.

అందరికీ విద్యను అందిస్తామని కూడ  బీజేపీ వివరించింది మహిళా సాధికారికతపై దృష్టి పెట్టనున్నామని బీజేపీ  హామీలు గుప్పించింది.ఈ మేనిఫెస్టోను బీజేపీ సంకల్ప్ పత్ర గా ఆ పార్టీ ప్రకటించింది.

సంకల్ప్‌ పత్ర తయారు చేసేందుకు గాను దేశంలోని సుమారు 6 కోట్ల మందిని సలహాలను, సూచనలను స్వీకరించినట్టుగా ఆ పార్టీ తెలిపింది. రూ. 25 లక్షల కోట్లు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఖర్చు చేసిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ  తొలి దశ ఎన్నికల ప్రచారం సమయంలోనే మేనిఫెస్టోను విడుదల చేసింది.

click me!