రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి

By narsimha lodeFirst Published Apr 19, 2019, 5:35 PM IST
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ నియోజకవర్గంలో న్యాయ్ పథకానికి సంబంధించిన పోస్టర్ ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఈసీ అభిప్రాయపడింది.

ఆమేథీలోని ఓ ఇంటి యజమాని అనుమతి లేకుండానే ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేయడం ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని ఈసీ చెబుతోంది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని 24 గంటల్లో వివరణ ఇవ్వాలని  ఈసీ ఆదేశించింది. 

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల సమయంలో  ప్రతి ఏటా పేదలకు రూ.72 వేలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రతి నెల ఒక్కో పేద కుటుంబానికి రూ. 12 వేలను ఇస్తామని రాహుల్ ప్రకటించారు.

దేశంలోని 20 శాతం పేదలకు ఈ పథకం కింద లబ్ది చేకూర్చనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడ ఈ అంశాన్ని చేర్చింది.పేదరికంపై న్యాయ్ పథకం సర్జికల్ స్ట్రైక్ వంటిదని  రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో  ప్రకటించిన విషయం తెలిసిందే.


 

click me!