అమితాబ్ మోడీ కన్నా మంచి పిఎం అయి ఉండేవారు: ప్రియాంక గాంధీ

Published : May 17, 2019, 05:27 PM IST
అమితాబ్ మోడీ కన్నా మంచి పిఎం అయి ఉండేవారు: ప్రియాంక గాంధీ

సారాంశం

"మీరు మహా నటుడిని ప్రధానిగా ఎన్నుకున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రధాన మంత్రిని చేసి ఉంటే ఇంతకన్నా ఉత్తమంగా ఉండేది. ఏమైనా వాళ్లు మీ కోసం ఏమీ చేయరు" అని ప్రియాంక గాంధీ అన్నారు. 

మీర్జాపూర్: ఎన్నికల ప్రచారం ముగింపు దశలో కాంగ్రెసు నేత ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోడీని మహా నటుడిగా అభివర్ణించారు. మిర్జాపూర్ రోడ్ షోలో శుక్రవారంనాడు మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. 

"మీరు మహా నటుడిని ప్రధానిగా ఎన్నుకున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రధాన మంత్రిని చేసి ఉంటే ఇంతకన్నా ఉత్తమంగా ఉండేది. ఏమైనా వాళ్లు మీ కోసం ఏమీ చేయరు" అని ప్రియాంక గాంధీ అన్నారు. 

మిర్జాపూర్ లోకసభ నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి లలితేష్ పతి త్రిపాఠీ తరఫున ఆమె ప్రచారం చేశారు. ఆయనపై బిజెపి మద్దతుతో అప్నా దళ్ అభ్యర్థి  అనుప్రియ పటేల్ పోటీ చేస్తున్నారు. 

"యువకులకు ఉద్యోగాలు లేవు. రైతులు బాధపడుతున్నారు. 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయన (మోడీ) ప్రధాని కారు.. నటుడని నేను నమ్ముతున్నా" అని ప్రియాంక అన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా: సాయంత్రం గవర్నర్ కు అందజేత