మేనిఫెస్టో విడుదల: కనీస ఆదాయమే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా

By narsimha lodeFirst Published Apr 2, 2019, 12:51 PM IST
Highlights

 కనీస ఆదాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దేశంలోని 20 శాతం పేదలకు ఈ కనీస ఆదాయాన్ని వర్తింపజేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. 
ఈ మేరకు ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

న్యూఢిల్లీ:  కనీస ఆదాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దేశంలోని 20 శాతం పేదలకు ఈ కనీస ఆదాయాన్ని వర్తింపజేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. 
ఈ మేరకు ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

మంగళవారం నాడు  ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ మేనిఫెస్టోను ఆయన  విడుదల చేశారు.54 పేజీలతో మేనిఫెస్టోను రూపొందించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి సోనియాగాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు పాల్గొన్నారు.

పేదలకు కనీస ఆదాయాన్ని ప్రతి నెల రూ. 12 వేలు అందించేలా న్యాయ్ పథకాన్ని రూపొందించారు. సంక్షేమంతో పాటు సంపద సృష్టించే దిశగా మేనిఫెస్టోలో అంశాలను పొందుపర్చినట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్ పి. చిదంబరం ప్రకటించారు.

ఉద్యోగాల కల్పనతో పాటు, రైతుల సంక్షేమంపై  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యతను కల్పించింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ బాగా పనిచేసిందని   ఈ సందర్భంగా రాహుల్‌ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా రాహుల్ చెప్పారు. ఏడాదిగా మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు నిర్వహించినట్టుగా ఆయన గుర్తుచేశారు.

మేనిఫెస్టోలో అన్ని వాస్తవాలే ఉండాలని తాను మేనిఫెస్టో కమిటీకి సూచించినట్టు ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుకు వచ్చేలా ఈ ఐదు అంశాలకు మేనిఫెస్టోలో రూపకల్పన చేశారు.

కనీస ఆదాయంతో పాటు ఉద్యోగాల కల్పనపై కూడ  మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఉపాధి హమీ పథకాన్ని 100  నుండి 150 రోజులకు పొడిగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.రుణాలు కట్టని రైతులపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టబోమని ఆయన ప్రకటించారు.రాజ్యసభలో  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినట్టుగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని  రాహుల్ గాంధీ ప్రకటించారు.

 

click me!