వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విపక్షాలకు ఈసీ షాక్

Published : May 22, 2019, 01:45 PM IST
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విపక్షాలకు ఈసీ షాక్

సారాంశం

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని  కేంద్రం ఎన్నికల సంఘం బుధవారం నాడు  స్పష్టం చేసింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో విపక్షాల డిమాండ్‌ను ఈసీ తోసిపుచ్చింది.


న్యూఢిల్లీ: కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని  కేంద్రం ఎన్నికల సంఘం బుధవారం నాడు  స్పష్టం చేసింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో విపక్షాల డిమాండ్‌ను ఈసీ తోసిపుచ్చింది. ఈవీఎంల లెక్కింపు తర్వాతే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఈసీ ప్రకటించింది.

కౌంటింగ్‌ ప్రక్రియలో ఈవీఎంల కంటే ముందుగానే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు ఈసీని కోరాయి. కానీ ఈ విషయంలో విపక్షాల డిమాండ్‌ను ఈసీ తోసిపుచ్చింది. 
 

PREV
click me!

Recommended Stories

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా: సాయంత్రం గవర్నర్ కు అందజేత