కొంగుపట్టి ఆర్ధిస్తున్నా: కంటతడి పెడుతూ సుమలత అభ్యర్థన

Published : Apr 17, 2019, 11:14 AM IST
కొంగుపట్టి ఆర్ధిస్తున్నా: కంటతడి పెడుతూ సుమలత అభ్యర్థన

సారాంశం

ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని  కొంగుపట్టి  ఆర్ధిస్తున్నానని సినీ నటి సుమలత భావోద్వేగంతో ఓటర్లను కోరారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా పార్లమెంట్ స్థానం నుండి సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

బెంగుళూరు:  ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని  కొంగుపట్టి  ఆర్ధిస్తున్నానని సినీ నటి సుమలత భావోద్వేగంతో ఓటర్లను కోరారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా పార్లమెంట్ స్థానం నుండి సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నాలుగు వారాల ప్రచారాల్లో ఎన్నో అవమానాలు, అవహేళనలు, బెదిరింపులు ఎదుర్కొన్నానని వాటన్నింటిని మీతో పంచుకొనేందుకు మీ ముందుకు వచ్చానని సుమలత చెప్పారు. ఆమె మంగళవారం నాడు మాండ్యా పట్టణంలో నిర్వహించిన స్వాభిమాన సమ్మేళన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. సుమలతతో పాటు సినీ హీరోలు, యశ్, దర్శన్‌లు కూడ పాల్గొన్నారు.

అంబరీష్ మృతదేహాన్ని మాండ్యాకు తీసుకురాకూడదని సీఎం కుమారస్వామి ఆనాడు అడ్డుకొన్నారని సుమలత చెప్పారు. 500 బస్సుల్లో  అభిమానులను బెంగుళూరుకు తీసుకెళ్దామని సూచిస్తే తానే అంబరీష్ మృతదేహాన్ని పట్టుబట్టి మాండ్యాకు తీసుకొచ్చినట్టుగా ఆమె ప్రస్తావించారు.

అంబరీష్‌కు శ్రద్దాంజలి ఘటించే సమయంలో తనకు కుమారస్వామి అండగా నిలుస్తానని కుమారస్వామి హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు.. అంబరీష్ సమాధిపై తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు కుమారస్వామి బాటలు వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని సుమలత ఆరోపించారు. 

అంబరీష్ పోటీ చేసిన ప్రతి ఎన్నికల సమయంలో అతడిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత తీవ్రంగా ప్రయత్నాలు చేశారని మంత్రి డీకే శివకుమార్‌పై విమర్శలు గుప్పించారు. తనకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కక్ష కట్టారన్నారు. ప్రజా సేవకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. మాండ్యా ప్రజలపై నమ్మకంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీకి దిగినట్టుగా ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

మాండ్యా: జేడీ(ఎస్)‌కు చుక్కలు చూపిస్తున్న సుమలత

 

PREV
click me!

Recommended Stories

రాంపూర్ లో ఓటమి: జయప్రద సంచలన వ్యాఖ్యలు
దిగ్విజయ్ విక్టరీకి హఠయోగం: ఎవరీ కంప్యూటర్ బాబా?