మోడీపై పోటీకి ప్రియాంక రెడీ: తేల్చని రాహుల్

By narsimha lodeFirst Published Apr 18, 2019, 5:39 PM IST
Highlights

వారణాసి ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అనే విషయమై ఆ పార్టీ  స్పష్టం చేయడం లేదు. ఈ రకమైన సస్పెన్స్ కొనసాగించడం చెడ్డదేం కాదు అని రాహుల్‌గాంధీ చెప్పారు.

న్యూఢిల్లీ: వారణాసి ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అనే విషయమై ఆ పార్టీ  స్పష్టం చేయడం లేదు. ఈ రకమైన సస్పెన్స్ కొనసాగించడం చెడ్డదేం కాదు అని రాహుల్‌గాంధీ చెప్పారు.

ఓ ఇంగ్లీష్ దినపత్రికకు రాహుల్ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన స్పష్టత ఇవ్వకుండానే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరి మాసంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆమెను ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతానికి ఇంచార్జీగా కాంగ్రెస్ పార్టీ  నియమించింది.

ఈ ప్రాంతంలోనే వారణాసి నియోజకవర్గం కూడ ఉంది. రాయ్‌బరేలీ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల ప్రియాంకగాంధీని  కోరారు. ఈ సమయంలో  వారణాసి నుండి పోటీ చేస్తే నష్టమా అని ఆమె ప్రశ్నించారు. 

అయితే వారణాసి నుండి  ప్రియాంక పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా ఆ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. మే 19వ తేదీన వారణాసి ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ నెల 29 వ తేదీ వరకు ఈ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయడానికి నోటిఫికేషన్ ఈ నెల 22వ తేదీ విడుదల కానుంది.ఇదే స్థానం నుండి నరేంద్ర మోడీ  బీజేపీ అభ్యర్ధిగా మరోసారి పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే.
 

click me!