ఆమేథీ: కాంగ్రెస్‌కు పెట్టని కోట

By narsimha lodeFirst Published Mar 5, 2019, 2:48 PM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 13 దపాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ప్రస్తుతం ఈ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు


లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 13 దపాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ప్రస్తుతం ఈ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  మరోసారి రాహుల్ ఈ స్థానం నుండి  బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ జిల్లాలో ఆమేథీ ఎంపీ సెగ్మెంట్‌ ఉంది. 1967లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడింది. 1967లో తొలిసారి ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విద్యధర్ బాజ్‌పేయ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1971లో కూడ ఆయన ఇదే స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగి గెలిచారు.

1977లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకొంది. జనతాపార్టీ అభ్యర్ధి రవీంద్ర ప్రతాప్ సింగ్  గెలిచారు.  1980లో ఈ స్థానం నుండి సంజయ్ గాంధీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి  పూర్వవైభవం తీసుకొచ్చారు. 

1981లో ఈ స్థానం నుండి రాజీవ్ గాంధీ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. 1984, 1989,1991లో కూడ రాజీవ్ గాంధీ ఈ స్థానం నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

1991లో తమిళనాడులో ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. దీంతో 1991లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ సతీష్ శర్మను బరిలోకి దింపింది. 1996,1998 ఎన్నికల్లో కూడ సతీష్ శర్మ విజయం సాధించారు.

1999 ఎన్నికల్లో ఈ స్థానం నుండి  సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  2004 లో ఈ స్థానం నుండి రాహుల్ గాంధీ విజయం సాధించారు.2009, 2014 ఎన్నికల్లో కూడ ఇదే స్థానం నుండి రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడ రాహుల్ ఇదే స్థానం నుండి పోటీ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

click me!