మంచు గుట్టల దారుల్లో ప్రయాణం/ కోరికల కాళ్ళకు తిమ్మిర్లు/ కరిగి పోయే స్వప్నాలుగా అంటున్నాడు తెలుగు కవి ప్రమోద్ ఆవంచ.. ఆర్ద్రమైన ఈ కవితను ప్రమోద్ కుమార్ అందించాడు, చదవండి...
మంచు గుట్టల దారుల్లో ప్రయాణం
కోరికల కాళ్ళకు తిమ్మిర్లు
కరిగి పోయే స్వప్నాలుగా
అడుగు అడుగు కి దూరం
ఎడారి ప్రాంతం
దాహం తీరని ఓయాసిస్సులు
గమ్యం నీదే గమనం నీదే
వెలుగు నీదే చీకటి నీదే
ఆకలిని నెమరేసుకున్న జ్ఞాపకాలు
బతుకు పోరాటానికి నిచ్చెనలు అయ్యాయి
ఆకలి, ఆత్మాభిమానాల గమనం లో
గమ్యాన్ని చేధించి విజయాన్ని సాధించి
చీకటిని తరిమి వెలుగును నింపి
హద్దు, ఎదురు లేక నింగి కెగిరిన
మనుషులు ఇప్పుడు ఆకలి భాష
మర్చిపోయారేమో.......
- ప్రమోద్ ఆవంచ
కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in
మరిన్ని కవితలు
అహోబిలం ప్రభాకర్ కవిత: సెలవు వికసిస్తుంది
వడ్డెబోయిన శ్రీనివాస్ కవిత: రోజుభాష-రాజభాష
వనపట్ల సుబ్బయ్య కవిత: ఎక్కబుడ్డి
గజ్జెల రామకృష్ణ తెలుగు కవిత: సహవాసం
కోడం కుమారస్వామి కవిత: మనలోని మను
డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి కవిత: స్వచ్ఛ నేస్తం
ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం
తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు
దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...