అహోబిలం ప్రభాకర్ కవిత: సెలవు వికసిస్తుంది

By telugu teamFirst Published Sep 28, 2019, 1:16 PM IST
Highlights

సెలవు వికసిస్తందని తెలుగు కవి అహోబిలం ప్రభాకర్ అంటున్నారు. ఆయన కవితను ఇక్కడ చదవండి....

అవనిని అణ్వాయుధంతో 
ధ్వంసం చేయడానికి
సరిహద్దులను నిర్మిస్తూ
మానవాళిని యుద్ధవీరులను చేస్తూ
ప్రాణాలను చిదుముతున్నది

నూరేళ్ళ జీవితానికి
వెయ్యేళ్ళ ఆకలికి
నీవు కాపరివి
నువ్వు నాటిన వృక్షం
శాఖలు గా విస్తరించక ముందే
నీకు నివాళులు అర్పిస్తుంది

సెల్ ఫోన్లో పాతిన నీ వునికి
ఖగోళ నిఘా నేత్రాల సాలెగూడు లో
చిక్కిన జి పి యస్ నువ్వు

ఓ అక్షర కాంతిపుంజమా !
విశ్వ విహారివై
ఈ భూమండలాన్ని ఒక్కటిగా
కలిపి కుట్టు

ఓ నీరమా
మేఘమై వర్షించి 
కొత్త ఆశల  పురిటినందివ్వు
ఆ ఊపిరి నిండా
మానవత్వపు పూలు పూయించు

యుద్ధాలకు సెలవు తో 
హ్రుదయాలు వికసించు 

-అహోబిలం ప్రభాకర్

కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

మరిన్న కవితలు

వడ్డెబోయిన శ్రీనివాస్ కవిత: రోజుభాష-రాజభాష

వనపట్ల సుబ్బయ్య కవిత: ఎక్కబుడ్డి

గజ్జెల రామకృష్ణ తెలుగు కవిత: సహవాసం

కోడం కుమారస్వామి కవిత: మనలోని మను

డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి కవిత: స్వచ్ఛ నేస్తం

ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం

తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

click me!