World blood donor day 2022: వ్యక్తి ఏడాదిలో ఎన్ని సార్లు రక్తదానం చేయొచ్చు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి..?

Published : Jun 13, 2022, 11:25 AM IST
World blood donor day 2022: వ్యక్తి ఏడాదిలో ఎన్ని సార్లు రక్తదానం చేయొచ్చు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి..?

సారాంశం

World blood donor day 2022: ప్రతి ఏడాది ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 14 న జరుపుకుంటారు. రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును నిర్వహిస్తారు.   

World blood donor day 2022: ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 14 న జరుపుకుంటారు. మొదటి ప్రపంచ రక్తదాత దినోత్సవం 2004 లో నిర్వహించారు. రక్తదానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.. తద్వారా మరింత మంది ప్రాణాలను కాపాడటానికి ప్రజలు రక్తదానం చేయడం.. దీనిని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం. రక్తదానం చేయడం వల్ల ఒకటి కాదు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తి ప్రాణాలను కాపాడినవాడవుతాడు. 

సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు రక్తదానం చేయొచ్చు:  మనం రక్తదానం చేసినప్పుడు.. ఆ సమయంలో దాదాపుగా ఒక యూనిట్ రక్తం తీసుకుంటారు. ఆ తరువాత 24 గంటల్లో రక్తం పునరుద్దరించబడుతుంది. అయితే RBC (Red blood cell) ఏర్పడటానికి సుమారు 3 నెలలు పడుతుంది. కాబట్టి మీరు ఒక సారి రక్తదానం చేసిన తరువాత.. కనీసం 3 నెలల తరువాత మీరు మళ్లీ రక్తదానం చేయాలి. అంటే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి  సంవత్సరంలో మూడు నెలల వ్యవధిలో గరిష్టంగా 4 సార్లు రక్తదానం చేయొచ్చన్న మాట.

రక్తదానం ఎవరు చేయాలి: 

రక్తదానం చేసే వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. అతనికి ఏ విధమైన వ్యాధి ఉండకూడదు.

17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రక్తదానం చేయకూడదు. అలాగే అతని బరువు కనీసం 45 కిలోలు ఉండాలి. దీనికంటే తక్కువ బరువు ఉంటే అతని నుంచి రక్తం తీసుకోలేరు. 

18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి.. ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి అయినా రక్తదానం చేయొచ్చు. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి అనారోగ్యం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాకుండా.. ఒకవేళ అతడు ఏదైనా ఔషధం (Medicine) తీసుకుంటున్నట్లయితే.. రక్తదానం చేయడం చేయకూడదు. 

రక్తదానం యొక్క ప్రయోజనాలు: 

1. రక్తదానం గుండె జబ్బులు (Heart disease)మరియు స్ట్రోక్ (Stroke)ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అప్పుడప్పుడు రక్తదానం (Blood donation) చేయడం వల్ల రక్తంలోని అదనపు ఇనుము నియంత్రణలో ఉంటుంది. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

2. రక్తదానం చేసిన తరువాత మన శరీరం వెంటనే దాని నుంచి కోలుకోవడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగా మన శరీరంలోని కణాలు ఎర్ర రక్త కణాల (RBC)ను తయారు చేయడంలో ఎక్కువగా పాల్గొంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

3. రక్తదానం కూడా బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. కానీ బరువు తగ్గడానికి మనం రక్తదానం చేయాలని దాని అర్థం కాదు. ఇది బరువును నియంత్రించడానికి ఒక మార్గం మాత్రమే. కానీ ఆహార ప్రణాళిక లేదు.

4. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో ఇనుము ఎక్కువగా ఉండదు. ఇది అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా రక్తదానం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

5. రక్తదానానికి ముందు ఆ వ్యక్తికి రక్త పరీక్షలు చేస్తారు. ఈ రక్త పరీక్షల్లో హిమోగ్లోబిన్ తో పాటు ఇతర అంటువ్యాధులు, ఇతర వ్యాధులను గుర్తిస్తారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
బరువు తగ్గాలి అనుకునేవారు ఏ రైస్ తినాలి?