శ్రీఘ్ర స్ఖలనంతో బాధపడే వారు ఉన్నట్లే... ఎంత సేపు శృంగారంలో పాల్గొన్నా కూడా స్ఖలనం కాక ఇబ్బంది పడుతుంటారు.
శ్రీఘ్ర స్ఖలనంతో బాధపడే వారు ఉన్నట్లే... ఎంత సేపు శృంగారంలో పాల్గొన్నా కూడా స్ఖలనం కాక ఇబ్బంది పడుతుంటారు. ఈ రెండింటిలో ఏ సమస్య ఉన్నా కూడా ఇబ్బంది పడక తప్పదు. భర్తల్లో ఈ సమస్య ఉంటే.. భార్యలు విస్కుకోవడం ఖాయం. దీనినే డీలేడ్ ఎజాక్యులేషన్ అంటారు.
ఈ సమస్య ఉన్నవారు..అంతా సజావుగానే ఉన్నా, అంగప్రవేశం తర్వాత ఎంతకీ క్లైమాక్స్‌కు చేరుకోలేక వీర్యస్ఖలనం జరగదు. దాంతో ఎంత సమయం గడిచినా అసంతృప్తితో సెక్స్ విరమించవలసి వస్తూ ఉంటుంది. మహిళలకు ఈ ధోరణి చిరాకు తెప్పించడమూ సహజమే! అయితే ఈ సమస్యకు కారణాలున్నాయి. కొందరికి హస్తప్రయోగం అలవాటు ఎక్కువగా ఉంటుంది.
ఆ సమయంలో కలిగే ఒరిపిడి, లైంగిక క్రీడలో పొందలేకపోవచ్చు. భార్య మీద ఆసక్తి లోపించినా, పెళ్లికి ముందు ఊహించిన దానికి విరుద్ధమైన భాగస్వామి దొరికినా ఈ పరిస్థితి రావచ్చు. పోర్న్ ఎక్కువగా చూసే కొందరు పురుషులు ఆ వీడియోల్లో మహిళల్లా తమ భార్యలూ ప్రవర్తించాలని కోరుకుంటూ ఉంటారు. అలా జరగనప్పుడు కూడా ఎంతసేపటికీ స్ఖలనం జరగదు.
మరికొందరికి అంగం పూర్వచర్మం పూర్తిగా వెనక్కి రాదు. ఫైమోసిస్ సమస్య లేకపోయినా, అంగం ముందు భాగాన్ని కప్పి ఉంచే ఈ చర్మం వల్ల నొప్పి కూడా ఉండదు. కాకపోతే నాడులు ఎక్కువగా ఉండే ఆ ప్రదేశానికి ఒరిపిడి అందక క్లైమాక్స్‌కు చేరుకోలేకపోతూ ఉంటారు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని వైద్యులను సంప్రదిస్తే.. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.