మగపిల్లాడ్ని.. ఆడపిల్లగా అలంకరిస్తున్నారా..?

By ramya N  |  First Published Mar 12, 2019, 3:10 PM IST

మీరు గమనించే ఉంటారు.. ఇంట్లో ఆడపిల్ల లేదు కదా.. అని చాలా మంది తమ మగపిల్లల్ని.. ఆడ పిల్లల మాదిరి ముస్తాబు చేసి మురిసిపోతుంటారు.  ఆడపిల్లల దుస్తులు వేయడం, బొట్టుపెట్టడం, జడవేయడం, పువ్వులు పెట్టడం లాంటివి చేస్తుంటారు.


మీరు గమనించే ఉంటారు.. ఇంట్లో ఆడపిల్ల లేదు కదా.. అని చాలా మంది తమ మగపిల్లల్ని.. ఆడ పిల్లల మాదిరి ముస్తాబు చేసి మురిసిపోతుంటారు.  ఆడపిల్లల దుస్తులు వేయడం, బొట్టుపెట్టడం, జడవేయడం, పువ్వులు పెట్టడం లాంటివి చేస్తుంటారు.

చిన్న పిల్లలు కాబట్టి అలా చేస్తే.. ముద్దుగానే ఉంటారు. అయితే.. అది ఒక వయసు వరకు మాత్రమే చేయాలి అంటున్నారు నిపుణులు. పిల్లలకు ఊహ వచ్చిన తర్వాత అస్సలు ఇలాంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

Latest Videos

ఊహ తెలిసిన తర్వాత ఇలాంటివి చేయడం వల్ల మగపిల్లల్లో ఆడ లక్షణాలు నాటుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇరుగు పొరుగు ఆడ పేరుతో పిలవడం మొదలుపెడితే మగపిల్లల్లో ఆత్మన్యూనత దెబ్బతిని అందర్లో కలవకుండా అంతర్ముఖులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మగపిల్లలను ఆడపిల్లలుగా అలంకరించే అలవాటు పెద్దలు మానుకోవాలి.

అంతేకాకుండా.. మగపిల్లలు వయసు పరంగా వారిలో సరైన మార్పులు వస్తున్నాయో లేదో కూడా జాగ్రత్తగా తల్లిదండ్రులు గమనించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.  12, 13 ఏళ్లు వచ్చే సమయంలో మగపిల్లల్లో రొమ్ముల సైజు పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
అంగం, వృషణాల్లో ఏ ఒక్కటి చిన్నగా ఉన్నా అశ్రద్ధ చేయకూడదు.

ఆ తర్వాత 16 నుంచి 18 ఏళ్ల వయసులో సెక్సువల్‌ క్యారెక్టర్స్‌ స్పష్టంగా కనిపిస్తాయి. మగపిల్లవాడికి మీసాలు పెరగడం, మర్మాంగాల దగ్గర వెంట్రుకలు పెరగడం లాంటి లక్షణాలు ఉన్నాయో లేదో తండ్రులు గమనించాలి. ఈ లక్షణాలు కనిపించడం ఆలస్యమైతే వెంటనే వైద్యుల చేత హార్మోన్‌ పరీక్షలు చేయించాలి.
 

click me!