Vastu Tips-life style: ఏ రంగు బూట్లు అదృష్టాన్ని తెచ్చిపెడతాయో మీకు తెలుసా!

Published : May 28, 2025, 05:50 AM IST
Vastu Tips-life style: ఏ రంగు బూట్లు  అదృష్టాన్ని తెచ్చిపెడతాయో మీకు తెలుసా!

సారాంశం

వాస్తు ప్రకారం, బూట్ల రంగు మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. తెలుపు శుభప్రదం, కొన్ని రంగులకు దూరంగా ఉండాలి. బూట్లకు సంబంధించిన వాస్తు చిట్కాలు తెలుసుకోండి.

రోజూ మనం వేసుకునే బూట్లు  మన అదృష్టం మీద కూడా ప్రభావం చూపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు,  జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతీ రంగుకీ ఒక ప్రత్యేక గ్రహ సంబంధం ఉంటుంది. మీరు ఏ రంగు బూట్లు వేసుకుంటున్నారో దానికి తగ్గ ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదాహరణకి, ఆకుపచ్చ రంగు బుధునికి సంబంధించి బూట్లు వేసుకుంటే కలిగే ఫలితాలు ఏంటో నిపుణులు ఈ విధంగా తెలియజేస్తున్నారు.  మీరు జాతకంలో బుధుడు బలంగా ఉన్నవారు అయితే, ఆకుపచ్చ బూట్లు వేసుకోవడం వల్ల పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా, ఎరుపు రంగు కుజునికి, పసుపు రంగు గురునికి చెందుతాయి. ఈ రంగుల బూట్లు తగిన సమయం లేకుండా వేసుకుంటే, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

తెలుపు రంగు మాత్రం..

ఇదిలా ఉంటే, తెలుపు రంగు మాత్రం అన్ని సమయాలలో సానుకూలంగా ఉంటుంది. ఇది శుభం, శాంతి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. తెలుపు రంగు ఏ గ్రహానికీ విరుద్ధంగా ఉండదనే మాట వల్ల, ఇది అత్యంత సురక్షితమైన ఎంపికగా భావించవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునేవారు తెలుపు బూట్లను ప్రాధాన్యంగా ధరించవచ్చు.

ఇంకా ఒక ఆసక్తికరమైన వాస్తు సూచన ఏమిటంటే, శనివారం పాత బూట్లను శుభ్రంగా ఉంచి పేదవారికి దానం చేయడం మంచిదట. ఇది శనిదేవుని శాంతింపజేసే ఉపాయంగా చెప్పడం జరుగుతుంది. ఈ మార్గం అనుసరించడం ద్వారా కొన్నిరకాల సమస్యలు తగ్గిపోవచ్చు, ఆగిపోయిన పనులు పూర్తవుతాయని నమ్మకం.

మొత్తానికి చెప్పాలంటే, మీరు బూట్లు కొనేటప్పుడు కేవలం మోడల్‌కే కాకుండా, రంగుపై కూడా దృష్టి పెట్టడం మంచిది. సరైన రంగు ఎంపిక వల్ల మనశ్శాంతి, అభివృద్ధి, అదృష్టం లభించే అవకాశాలు పెరుగుతాయని వాస్తు చెబుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Glass Bottle Cleaning: దీనితో శుభ్రం చేస్తే... గాజు పాత్రలు కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Hair Care: వారానికోసారి ఈ మాస్క్ వాడినా జుట్టు రాలదు