Vastu plants: మీకు అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

Published : May 31, 2025, 11:23 PM IST
8 healthy benefits of having tulsi patta every morning

సారాంశం

ఏ వస్తువు ఎక్కడ ఉంటే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఆ వాస్తు ప్రకారం మీకు అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. అదృష్టం, శుభం, ధనం, ఆరోగ్యం కూడా వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇటువంటి వాస్తు మొక్కలు ఇంట్లో ఎక్కడ ఉంచాలో, వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి (Tulsi) 

తులసి మొక్కను భారతీయ సంస్కృతిలో చాలా పవిత్రంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటి ఉత్తర, తూర్పు, లేదా ఈశాన్య దిక్కులో ఉంచితే మంచిది. ఇది ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిను పెంచుతుంది. ఆనందం, ప్రశాంతత, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. తులసి మొక్క దగ్గర నిత్యం దీపం వెలిగించడం, దానిని పూజిస్తే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

శమీ మొక్క (Shami Plant) 

శమీ మొక్క(జమ్మి)ను శని దోష నివారణకు ఉపయోగపడే పవిత్ర మొక్కగా భావిస్తారు. దీన్ని ఇంటి దక్షిణ దిక్కులో నాటడం మంచిది. ఇది శని గ్రహ దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కార్యాల్లో విజయం, అభివృద్ధి అందిస్తుంది. దీనిని దసరా నాడు పూజించడం వల్ల విశేష ఫలితం కూడా కలుగుతుంది. 

సంపెంగ మొక్క (Champak/Champaka Plant) 

సంపెంగ ఒక సుగంధదాయకమైన పూల మొక్క. దీనిని తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిక్కుల్లో నాటాలి. ఇది ఇంట్లో ధన ప్రాప్తిని పెంచుతుంది. ఆహార కొరతలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించడంలో సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. సంపెంగ పువ్వులు పూజలలో కూడా ఉపయోగపడతాయి.

క్రాసుల మొక్క (Crassula Plant) 

క్రాసుల మొక్కను శుభదాయకమైన మొక్కగా పరిగణిస్తారు. ముఖ్యంగా వాస్తు దోషాలను తొలగించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి. ఇది ఇంట్లో సంపద, పాజిటివ్ ఎనర్జీ ను పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత పెరిగేలా చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

జేడ్ మొక్క (Jade Plant) 

జేడ్ మొక్క చిన్న ఆకులతో ఆకర్షణీయంగా ఉండే మొక్క. దీనిని ఇంట్లో ఉత్తర, ఈశాన్య, లేదా వాయువ్య దిక్కుల్లో ఉంచాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెచ్చిపెడుతుంది. ఆఫీసుల్లో ఉంచితే అభివృద్ధి, ప్రగతి లభిస్తాయి. వ్యాపారాలకు శుభదాయకంగా పరిగణిస్తారు.

మనీ ప్లాంట్ (Money Plant) 

ఇది అత్యంత ప్రసిద్ధమైన వాస్తు మొక్కలలో ఒకటి. చాలామంది ఈ మొక్కను ఇంట్లో పెంచుతారు. దీన్ని ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచితే మంచిదని నమ్ముతారు. ధన సమస్యలు తగ్గిపోవడం, లక్ష్మి కటాక్షం కలగడం వంటివి జరుగుతాయని నమ్మకం. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని, శుభ వాతావరణాన్ని కలిగిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు