
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజులపాటు ప్రేమికులు వారోత్సవాలను జరుపుకుంటారు. ఈ వారోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేయసికి అందమైన టెడ్డీబేర్ ఇచ్చి తమలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ఇలా టెడ్డీబేర్ ఇవ్వడం వల్ల వారిద్దరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఏర్పడుతుందని అమ్మాయిలు కూడా టెడ్డీబేర్లను ఇష్టపడటం వల్ల వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు.
ఇలా టెడ్డీబేర్ ఇవ్వడం వెనుక ఓ చిన్న కథ ఉంది. టెడ్డీ పేరు వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ ‘టెడ్డీ’ రూజ్‌వెల్ట్ ఉన్నారని ప్రచారంలో ఉంది.రూజ్‌వెల్ట్ ఒకసారి తన సహాయకులు ఎలుగుబంటిని బంధించి కాల్చి చంపడాన్ని ఖండించారు. ఈ ఘటన నుంచి ప్రేరణ పొందిన న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని మిఠాయి దుకాణం యజమాని మోరిస్ మిచ్‌టామ్ ప్రేరణ పొంది.. అధ్యక్షుడు టెడ్డీ’ రూజ్‌వెల్ట్ కి స్టఫ్డ్ టాయ్ బేర్‌ను అంకితం చేసి, దానికి టెడ్డీస్ బేర్ అని పేరు పెట్టారు.
ఇక టెడ్డి బేర్స్ ఎన్నో రకాలుగా ఎన్నో రంగులలో మనకు లభిస్తున్నాయి అయితే ఏ రంగు దేనిని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం...
ఎరుపు రంగు టెడ్డీబేర్ ప్రేమను ఇద్దరి మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది. ఇక ఈరోజు ప్రేమికులు ఎవరైనా పింక్ కలర్ టెడ్డీబేర్ కనుక ఇస్తే వారి ప్రేమను అంగీకరించమని అర్థం. బ్లూ కలర్ టెడ్డీబేర్ బలం, జ్ఞానం నిబద్ధతను సూచిస్తుంది.ఈరోజు ప్రేమికులు బ్లూ కలర్ టెడ్డీబేర్ ఇచ్చుకుంటే వారి ప్రేమ బంధం ఎంతో బలంగా మారుతుందని అర్థం.
గ్రీన్ కలర్ టెడ్డీబేర్ ఇస్తే ప్రేమ బంధం మరింత బలపడటమే కాకుండా ప్రేమించిన వారి కోసం వేచి చూస్తున్నానని అర్థం. ఇక ఆరెంజ్ కలర్ టెడ్డీబేర్ ఆనందం ఆశ కాంతికి చిహ్నంగా భావిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రంగు టెడ్డీబేర్ ను వారి ప్రేయసికి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు.అయితే కొన్ని రకాల టెడ్డీబేర్లు కొన్ని లక్షల కోట్ల విలువలు చేస్తున్నాయి మరి అలాంటి టెడ్డీబేర్లు ఏంటి అనే విషయానికి వస్తే...
* స్టెఫ్ లూయిస్ విట్టన్ టెడ్డీ బేర్- మొగల్స్ లూయిస్ విట్టన్, స్టెఫ్‌లు క్రియేట్ చేసిన ఈ టెడ్డీబేర్ ప్రపంచంలోనే అత్యంత ధర కలిగినది ఇది ఏకంగా 16 కోట్ల రూపాయల విలువ చేస్తుంది.
* లూయిస్ విట్టన్ మోనోగ్రామ్స్- ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన టెడ్డీబేర్ ఇది. ఎల్వీ బ్రాండ్ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇది తయారు చేశారు దీని విలువ ఒక కోటి 45 లక్షలు.
* స్టెఫ్ టెడ్డీ గర్ల్ బేర్- బ్రిటీష్ కల్నల్ బాబ్ హెండర్సన్‌కి ఈ టెడ్డీబేర్ కానుకగా ఇచ్చారు ఇది ఒక కోటి 14 లక్షల రూపాయలు.
* స్టెఫ్ టైటానిక్ - 1912లో, టైటానిక్ మునిగిన తరువాత చనిపోయాన వారికి అంకితమిస్తూ ఈ టెడ్డీబేర్ తయారు చేశారు దీని విలువ కోటి 8 లక్షలు.
* సుప్రీం లూయిస్ విట్టన్ టెడ్డీ బేర్ విలువ 84 లక్షల 84 వేల రూపాయలు.
* స్టెఫ్ ఓల్డ్ టెడ్డీ బేర్- 1904లో తయారైన ఈ టెడ్డీబేర్ చాలా పురాతనమైనది దీని విలువ 84 లక్షల రూపాయలు.
* డైమండ్ ఐస్ బేర్- జర్మన్ స్టెఫ్ కంపెనీ తయారుచేసిన ఈ టెడ్డీబేర్ 67 లక్షల రూపాయలు.
* బ్లూ ఇలియట్ బేర్ బ్రిటిష్ వాళ్లు తయారుచేసిన ఈ టెడ్డీబేర్ 51 లక్ష రూపాయలు.
* హార్లెక్విన్ బేర్- 1925లో తయారుచేసిన ఈ టెడ్డీబేర్ విలువ 48 లక్షలు.
* హ్యాపీ స్టెఫ్ బేర్- 1926 లో తయారు చేసిన ఈ టెడ్డీబేర్ విలువ 44లక్షల రూపాయలు.