ఉగాది పండుగ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

Published : Mar 14, 2023, 12:43 PM ISTUpdated : Mar 14, 2023, 12:44 PM IST
 ఉగాది పండుగ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

సారాంశం

Ugadi 2023: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది పండుగ  మార్చి 22న వచ్చింది. 

Ugadi 2023: ఉగాది దక్షిణ భారతదేశంలో ఒక ప్రసిద్ధ పండుగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది కొత్త ప్రారంభాలకు నాంది పలుకుతుంది. గతేడాది ముగింపును సూచిస్తుంది కూడా. ఈ ప్రత్యేకమైన పండుగ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఉగాది అంటే ఏంటి ? 

దక్షిణాది రాష్ట్రాలైనా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం..  కొత్త సంవత్సరం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడాన్ని సూచిస్తుంది.

ఎప్పుడు జరుపుకుంటారు? 

హిందూ క్యాలెండర్ ప్రకారం.. చైత్ర మాసం మొదటి రోజును ఉగాదిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది ఉగాది మార్చి 22న జరుపుకోనున్నారు. ఈ పండుగ మహారాష్ట్రలోని గుడి పడ్వా పండుగతో కలిసి వస్తుంది. 

ఉగాది చరిత్ర

హిందూ పురాణాల ప్రకారం.. ఈ విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. బ్రహ్మదేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని ప్రజలు నమ్ముతారు. ఈ పండుగలో మొదటి రోజు దుర్గామాతా రూపాలను పూజిస్తారు.

ఉగాది ఎందుకు అంత ప్రత్యేకత కలిగి ఉంది?

ఉగాది అంటే ఆరంభం అని అర్థం. యుగం అంటే కాలం అని, ఆది అంటే ఏదో ఒక దాని ప్రారంభం అని అర్థం. ఇతర నూతన సంవత్సర వేడుకల మాదిరిగానే ఉగాది కూడా కొత్త ఆరంభాలను సూచిస్తుంది. దేవతల ఆశీస్సులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఈ రోజును జరుపుకుంటారు. నూనెతో స్నానం, ఇంటి శుభ్రత, ఆరాధన వంటి ఆచారాలను అనుసరించి ఈ పండుగను జరుపుకుంటారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cancer with Eggs: ఈ గుడ్లలో ప్రమాదకర రసాయనాలు.. తింటే క్యాన్సర్ వస్తుందా?
Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?