గర్భదారణకు ముందు ఈ ఆహారం బెస్ట్ ఆప్షన్

By ramya NFirst Published Mar 7, 2019, 3:22 PM IST
Highlights

గర్భదారుణకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. 

పిల్లలు కావాలని కోరుకోని జంట ఎవరు ఉంటారు చెప్పండి. ఇంట్లో చిన్నారులు ఉంటే ఆ సందడే వేరు. అసలు.. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే.. టైమ్ కూడా ఇట్టే గడిచిపోతుంది. మీరు కూడా  మీ ఆనందకర జీవితంలోకి మరో ప్రాణిని ఆహ్వానించాలని అనుకుంటున్నారా..? అలాంటి వారు.. ముఖ్యంగా స్త్రీలు.. గర్భదారణకు ముందు కొన్ని రకాల ఫుడ్ ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది.

గర్భదారుణకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసాహారం, గుడ్లు తీసుకోవాలి.

ఒకవేళ మీరు శాకాహారులైతే.. పాలు, పెరుగు, పనీర్, వివిధ రకాల పప్పు ధాన్యాలు రోజూ తప్పనిసరిగా తినాలి. వైద్య పరీక్షలు చేయించుకొని, విటమిన్ లోపం ఉన్నట్లయితే..వైద్యుల సలహా మేరకు మందులను వాడాలి.

ఫోలిక్ ఆసిడ్ అధికంగా లభించే ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉండే చేప, అవిసె గింజలు, ఆక్రోట్ తీసుకోవాలి. కనీసం రెండూ, మూడు సార్లు పండ్లు తినాలి. విటమిన్ డి లోపం రాకుండా ఉండేందుకు రోజుకి కనీసం పదిహేను నిమిషాలు ఎండలో నడవాలి.

సమయానికి తినడం, నిద్రపోవడం తప్పనిసరి. ఆహారం విషయంలో జాగ్రత్తలే కాకుండా రోజూ ఏదో ఒక వ్యాయామం చేయాలి. నడక, పరుగు, యోగా,  ఈత లాంటివి ప్రయత్నించవచ్చు. 

click me!