
Celebrity Gossip: ‘హే నీకిది తెలుసా.. ఆ సెలబ్రిటీ జంట విడిపోతుందట. ఆ హీరోయిన్ చూడు ఎలా బోల్డ్ గా ఉంటుందో ఆమె డ్రెస్సు చూడు వేసుకున్నా.. వేసుకోనట్టే ఉంది. ఆ హీరోయిన్ చాలా హాట్ ’ అంటూ సెలబ్రిటీల గురించి పుకార్లు పెట్టుకోవడం చాలా మందికి ఒక హాబిట్ లా మారింది. సెలబ్రిటీల గురించి తరచుగా పుకార్లు మాట్లాడుకునే వారు చాలా తెలివి గల వారని కొంతమంది భావిస్తుంటారు. వాస్తవానికి ఈ సెలబ్రిటీ పుకార్లు పెట్టుకునే వారికి తెలివి చాలా తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం తేల్చి చెబుతోంది. కాగా ఈ విషయంపై పలు హాస్యాస్పదమైన, వివాదాస్పదమైన విషయాలను వెళ్లడయ్యాయి.
ఇకపోతే మరి ఈ విషయాలను మాట్లాడుకునే వారి సంగతి పక్కన పెడితే.. ఈ విషయాలను రాసే వారి సంగతేంటి మరి అంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వీటిని తెగ ఇష్టపడి చదివే వారికి తెలివి తక్కువగా ఉంటుందని చెప్పారు కదా.. మరి వాటిని రాసే వారికి తెలివి ఎలా ఉంటుందంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయం గురించి అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు హంగేరికి చెందిన 1763 మంది పెద్దలను సెలక్ట్ చేసుకున్నారు. వీరిపై Digit Symbol Substitution, 30 words Vocabulary పరీక్ష పెట్టారు. దీనిద్వారా శాస్త్రవేత్తలు ఒక అవగాహనకు వచ్చారు. వీటిద్వారానే ఫలితాలను తెలియజేశారు. కాగా రెండు దశాబ్దాల నుంచే సెలబ్రిటీలను అమితంగా ఆరాధించడం మొదలుపెట్టారట. అయితే కొన్నేళ్లుగా జరుగుతున్న అధ్యయనాల ప్రకారం.. ఏవరైనా సెలబ్రిటీకి అభిమానులుగా మారతారో.. వారి విషయాలను తరచుగా తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఆ సెలబ్రిటీ గురించి ఏ చిన్న వార్తొచ్చినా, పుకార్లు వచ్చినా వాటి గురించే ఎక్కువగా ఆలోచించడం, ఆ వార్తలనే చదవడం, వారి గురించే ఎక్కువగా మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారట. అలాంటి వారికి Cognitive Skills తక్కువగా ఉంటాయని అధ్యయాలు పేర్కొంటున్నాయి. దీని అర్థం ఇలాంటి వారికి తేవిలి చాలా తక్కువ మొత్తంలో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
సెలబ్రిటీల పట్ల అభిమానం మితిమీరితేనే వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానివల్లనే వారికి Cognitive Skills తక్కువ మొత్తంలో ఉంటారు. అందుకే సెలబ్రిటీల పట్ల అభిమానం, ఆరాధన ఉండొచ్చు. కానీ అది మితిమీరితేనే అసలుకే ఎసరులా మారుతుందట. వాళ్లే మీ లోకంగా భావించి వారిపై ఎక్కువ ధ్యాస పెట్టకండి. మీకు తెలుసా.. సెలబ్రిటీల పట్ల అమితమైన ఇష్టమున్నవారే ఇతర సెలబ్రిటీలను ట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అంతెందుకు వారికిష్టమైన సెలబ్రిటీలకు ఏదైనా సమస్య వస్తే అది వీరి సమస్యలా భావించి ఇతర వ్యక్తులతో గొడవలకు దిగుతుంటారు. కాబట్టి నటీ లేదా నటుడిపై అతి ఇష్టాన్ని పెంచుకోకండి. ప్రేమ హద్దుల్లో ఉంటేనే అన్నింటికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.