Magha Masam: మాఘమాసం విశిష్టత.. ఈ మాసంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా..?

By Mahesh Rajamoni  |  First Published Feb 12, 2022, 11:15 AM IST

Magha Masam: మాఘమాసంలో వచ్చే ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంటుందో.. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి రోజూ కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తుంటారు. కాగా ఈ మాఘమాసంలో విష్ణు సహస్రనామాలను చదవడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని వేదాలు చెబుతున్నాయి.
 


Magha Masam:  హిందువుల పండగల్లో మాఘమాసం ఎంతో పుణ్యప్రదమైనది. కార్తీక మాసానికి ఎంత ప్రత్యేకత, విశిష్టత ఉంటుందో.. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి రోజుకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. ఎందుకంటే మాఘమాసంలో వచ్చే ప్రతి రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇకపోతే ఈ మాఘమాసం ఫిబ్రవరి 2 పాడ్యమి నుంచి మొదలై మార్చి 2 వరకు అంటే అమావాస్య వరకు ఉంటుంది. కాగా ఈ మాఘమాస స్నానం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తాయి. ఈ మాఘస్నాన పుణ్యం వల్లే  మృకండుముని మనస్వినిల కొడుకు మార్కండేయుడు మృత్యువును జయిస్తాడని పురాణం చెబుతోంది. 

మాఘమాసంలో చేసే స్నానాలు ఎంతో పవిత్రమైనవి. మన పాపాలను కడిగేమని ఆ దేవుడిని స్మరిస్తూ స్నానం చేయడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే స్నానాలు చేసేటప్పుడు శ్రీ విష్ణోతోషణాయచ అంటూ ఎన్నో వేధాలను జపిస్తూ ఈ పుణ్య స్నానాలను చేస్తుంటారు. ఈ స్నానం చేసే ముందు ప్రయాగ ను చదివితే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు విశ్వసిస్తారు.  కాగా ఈ మాఘమాసంలో సముద్ర స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని వేదాలు చెబుతున్నాయి.

Latest Videos

undefined

తిథులు: ఈ మాఘమాసంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో వ్రతాలను చేస్తుంటారు. అంతేకాదు ఎంతో మంది దేవతలను పూజిస్తూ తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో ప్రజలంతా వివిద దేవతారాధనలోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అందుకే ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఇకపోతే ఈ మాసంలో ఎంతో ప్రత్యేకమైనది తిథి శుక్ల పక్ష చవితి . దీన్నే కుంద చతుర్థి లేదా తిల చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాగా ఆ రోజున నవ్వులతో లడ్డూలను చేసి పంచి పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. 

మాఘమాసంలో చేయకూడని పనులు:  ఈ మాఘమాసంలో చాలా మంది ముల్లంగి దుంపలనుు తినకూడదని శాస్త్రం చెబుతుంది. కాగా ఈ నెల రోజుల  పాటు నవ్వుల్లో చక్కెరను కలుపుకునే తింటే మంచి ఫలితం ఉంటుందట. అంతేకాదు నువ్వులను ఇతరులకు దానం చేస్తుంటారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని. కాగా గోధుమ రంగులో ఉండే నువ్వులను రాగిపాత్రలో వేసి దానమిస్తే అంతా మంచే జరుగుతుందట. 

మాఘమాంసలో వచ్చే ప్రతి ఆదివారం ఎంతో పవిత్రమైనదిగా కొలుస్తుంటారు. అంతేకాదు ఈ రోజుల్లో ఎంతో మంది దేవతలు ఎన్నో పూజలను నైవేద్యాలను అందుకుంటారు. కాగా ఈ మాఘమాసం మొత్తం శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి. ఈ రోజుల్లో పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది. 

click me!