మీ జుట్టు పొడుగ్గా పెరగాలంటే?

Published : Apr 29, 2023, 04:14 PM IST
మీ జుట్టు పొడుగ్గా పెరగాలంటే?

సారాంశం

జుట్టు పెరిగేందుకు విటమిన్లు ఎంతో అవసరమవుతాయి. ఒకవేళ విటమిన్లు లోపిస్తే జుట్టు బలం తగ్గిపోతుంది. విపరీతంగా రాలుతుంది కూడా. మరి జుట్టు రాలకుండా ఉండటానికి, పెరిగేందుకు ఎలాంటి విటమిన్లను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం, చుండ్రు, విటమిన్ల లోపం వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు బలహీనపడి రాలుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఆరోగ్యకరమైన ఆహారం ఎంతగానో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు విటమిన్లు చాలా చాలా అవసరం. విటమిన్స్ లోపించడం వల్లే మన జుట్టు బలం తగ్గుతుంది. వెంట్రుకలు రాలిపోతాయి. మరి జుట్టు పెరిగేందుకు ఎలాంటి విటమిన్లను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బచ్చలికూర

బచ్చలికూర విటమిన్ల బాంఢాగారం. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పాలకూరను డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది. బచ్చలికూర ఒక్క జుట్టునే కాదు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

చిలగడదుంప

చిలగడదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చిలగడదుంపలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చిలగడదుంపలను తింటే మీ జుట్టు బాగా పెరుగుతుంది.

సాల్మన్ ఫిష్

సాల్మన్ చేపలు కూడా జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడతాయి. 

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. రోజుకో గుడ్డును తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. 

బెర్రీలు

బెర్రీలు కూడా పోషకాలకు మంచి వనరు. ఈ పండ్లను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు పెరగడానికి సహాయపడతాయి.

గింజలు

రోజూ గుప్పెడు గింజలను తింటే ఆరోగ్యం బాగుంటుంది. పోషకాల లోపం కూడా పోతుంది. గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి.  ఇవి మీ జుట్టు పెరగడానికి సహాయపడతాయి. అందుకే రోజూ బాదం, వాల్ నట్స్ వంటి గింజలను తినండి. 

అవొకాడో

అవోకాడో లను తింటే కూడా ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
 

PREV
click me!

Recommended Stories

Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు