
ఆప్టికల్ ఇల్యూషన్ మానసిక ఆరోగ్యానికి మేలు చేసే పజిల్. ఇవి మెదడు పనితీరును, కంటి పనితీరును మెరుగు పరుస్తాయి. అలాగే మీ ఐక్యూ స్థాయిలను కూడా పరీక్షిస్తాయి. కంటి ముందు కనిపిస్తున్నా ఒక్కోసారి కొన్ని వస్తువులను మనం పసిగట్టలేం. అలాగే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో కూడా ఒకచోట 6 అంకె ఇరుక్కుని ఉంది. కానీ అన్ని చోట్ల ఎనిమిది ఉండడంతో ఆరును కనిపెట్టడం కాస్త కష్టమే. మీ మెదడు, కంటి సహాయంతో ఆ ఆరును కనిపెట్టి చెప్పాలి. ఎక్కువ సమయం ఇస్తే మీరే కాదు చిన్న పిల్లలు కూడా కనిపెట్టేస్తారు. మీకు మేము ఇస్తున్న సమయం కేవలం 10 సెకన్లు. 10 సెకన్లలో ఆరు సంఖ్యను కనిపెడితే మీ కంటి చూపు, మెదడు పనితీరు అద్భుతంగా ఉందని ఒప్పుకోవచ్చు.
ఆప్టికల్ ఇల్యూషన్లో సాధారణ పద్ధతిలాగే కనిపిస్తాయి. నిజానికి ఇవి మీ మెదడు శక్తికి నిజమైన పరీక్షను పెడతాయి. మొదటి చూపులోనే దీన్ని సాధించడం చాలా కష్టం. తీక్షణమైనా కంటి చూపుతో, ఏకాగ్రతతో వీటిని పరిష్కరించాలి. ఐక్యూ స్థాయిలు అధికంగా ఉన్న వారే ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా సాధించగలుగుతారు.
ఇక్కడ ఇచ్చిన చిత్రంలో అన్ని చోట్ల ఎనిమిదే ఉంది. కాబట్టి మీ కళ్లు, మెదడు కలిసి ఆ ఎనిమిది అంకెతోనే నిండిపోయి ఉంటాయి. ఆ మధ్యలో ఇరుక్కున్న ఆరును కనిపెట్టలేరు. కాబట్టి అసాధారణమైన ఏకాగ్రతతో మీరు ఆ ఆరును కనిపెట్టాలి. ఇక జవాబు విషయానికి వస్తే ఇప్పటికే ఆరు సంఖ్యను 10 సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. కనిపెట్టలేక ఇబ్బంది పడుతున్న వారికి మేమే జవాబు చెప్పేస్తున్నాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో చివరి నిలువ వరుసలో ఐదో అడ్డు వరుసలో ఈ ఆరు అనే అంకె ఉంది. అదే జవాబు.
తరచూ ఆప్టికల్ ఇల్యూషన్లను సాధించేందుకు ప్రయత్నించండి. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు మెదడు, కంటి మధ్య సమన్వయాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పిల్లల చేత కూడా ఇలాంటివి చేయించడం ఎంతో ముఖ్యం. ఇవి వారి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పెద్దయిన తర్వాత సమస్యా పరిష్కార నైపుణ్యాలను వారిలో పెంచుతాయి.