
స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి ఏడాది వచ్చే అతి పెద్ద పండుగ. మన దేశం స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమైపోయింది. ఎంతోమంది త్యాగధనుల కలలనుంచి పుట్టిన స్వేచ్ఛ పతాకమే భారతదేశం. ఈ రోజున దేశభక్తి గీతాలతో, త్రివర్ణ పతాకాలతో భారతావని మువ్వన్నెల్లో మురిసిపోతుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు, వాట్సాప్ స్టేటస్ పెట్టేందుకు, బంధువులకు, మిత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు స్వాతంత్య్ర దినోత్సవ విషెస్ కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము తెలుగులోనే అందించాము. మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని మీ స్నేహితులకు పంపండి.
1. భారతదేశానికి స్వేచ్ఛ అనేది
యాదృచ్ఛికంగా వచ్చింది కాదు
ఎంతోమంది ధనమాన ప్రాణ త్యాగాల వల్ల కలిగింది
ఆ త్యాగాలను గౌరవిద్దాం
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
2. సమరయోధులు...
స్వేచ్ఛా భారతదేశం గురించి కలలు కన్నారు
ఇప్పుడు ఆ స్వేచ్ఛను అనుభూతి చెందుతున్నాం
ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
3. నిజమైన దేశభక్తి అంటే
కేవలం జెండావందనం చేయడం కాదు
మెరుగైన దేశాన్ని నిర్మించేందుకు
మీ వంతు కృషి చేయడం
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
4. మనకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు
కానీ మనమందరం మన దేశాన్ని గౌరవించాలి
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
5. స్వాతంత్య్ర సమరయోధులు
మనకు స్వేచ్ఛ ఇచ్చారు
రాబోయే తరానికి కలలుకనే విలువైన భవిష్యత్తును
మనమందరం అందిద్దాం
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
6. మన స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం
అసువులు బాసిన సమరయోధులను స్మరిస్తూ
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
7. స్వేచ్ఛగా ఉండడం అనేది అత్యంత విలువైనది
ఆ స్వేచ్ఛను మనం మన దేశ
స్వాతంత్ర్యం ద్వారానే పొందాము
ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర శుభాకాంక్షలు
8. ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూ భారతిని
నిలపరా నీ జాతి నిండు గౌరవము
ప్రతి ఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
9. సమరయోధుల పోరాట బలం
అమరవీరుల త్యాగఫలం
మన స్వాతంత్య్ర దినోత్సవం.
బానిస సంకెళ్లు తెంచుకొని
భారతజాతి విముక్తి పొందిన
చారిత్రాత్మకమైన రోజు ఈరోజు
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
10. ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన
భారత భూమిపై పుట్టినందుకు నేను గర్విస్తున్నాను
నా దేశంలో పుట్టిన వారంతా కూడా ఎంతో ధన్యులు
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
11.వేరు వేరు జాతులు
వేరు వేరు భాషలు
అయినా మనమంతా ఒక్కటే.
కులాలు వేరు, మతాలు వేరు
అయినా మనమంతా భారతీయులం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
12. ఈ మువ్వన్నెల జెండా పుట్టుకలో త్యాగం ఉంది
శాంతి మంత్రం ఉంది, పోరాటం ఉంది.
సభ్యత, సంస్కారం ఉంది.
ఆ జెండా నా దేశ జాతీయ జెండా
హ్యాపీ ఇండిపెండెన్స్ డే